వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎమ్మెల్యే పై చేయి చేసుకున్న జగన్ ? టీడీపీ నేత పోస్టు- ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై సీఎం వైఎస్ జగన్ చేయి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు సర్కులేట్ అవుతోంది. తాజాగా ఓ వ్యవహారంలో ఎమ్మెల్యేపై జగన్ దాడి చేశారంటూ విపక్ష కార్యకర్త ఒకరు పోస్టు పెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మైలవరం ఎమ్మెల్యే వసంత స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారం కృష్ణాజిల్లాలో చర్చనీయాంశమవుతోంది.

 వసంతపై చేయి చేసుకున్న జగన్ ?

వసంతపై చేయి చేసుకున్న జగన్ ?

కృష్ణాజిల్లాలోని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై సీఎం జగన్ చేయిచేసుకున్నారంటూ సోషల్ మీడియోలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగిందన్న వివరాలు లేకపోయినా సోషల్ మీడియాలో వచ్చిన ఈ పోస్టు వైరల్ అవుతోంది. దీంతో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సీఎం జగన్, తన సొంత పార్టీ ఎమ్మెల్యే, తనకు సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కూడా అయిన వసంత కృష్ణప్రసాద్ పై ఎందుకు చేయి చేసుకుంటారనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

ఖమ్మం తెలుగుయువత నేత పనే ?

ఖమ్మం తెలుగుయువత నేత పనే ?

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను సీఎం జగన్ కొట్టారంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు యువత నేతగా భావిస్తున్నారు. దీంతో ఆయన పెట్టిన పోస్టు టీడీపీ గ్రూపుల్లో వైరల్ అయినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో సదరు నేత వసంత, జగన్ మధ్య సంబంధాల్ని దెబ్బతీసేందుకే ఈ పోస్టు పెట్టారా లేక దీని వెనుక ఎవరి ప్రోద్భలమైనా ఉందా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు వసంత కృష్ణప్రసాద్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మైలవరం పోలీసులు రంగంలోకి దిగారు.

Recommended Video

KCR Follows Ys Jagan | Why Spreading Venom When Govt Does Good ? | Oneindia Telugu
వసంత కేబినెట్ అవకాశాల్ని దెబ్బతీసేందుకే ?

వసంత కేబినెట్ అవకాశాల్ని దెబ్బతీసేందుకే ?


వాస్తవానికి వసంత కృష్ణప్రసాద్, వైఎస్ జగన్ మధ్య సుదీర్ఘ అనుభవం ఉంది. వీరిద్దరూ హైదరాబాద్ లో వ్యాపార భాగస్వాములు కూడా. జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ వసంత పాత్రపై సీబీఐ అభియోగాలు చేసింది. దీంతో పాటు స్వయంగా జగన్ పార్టీలో ఎమ్మెల్యేగా వసంత ఉన్నారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలోనూ వసంత కృష్ణప్రసాద్ కమ్మ సామాజికవర్గం నుంచి కేబినెట్ లో చోటు కల్పిస్తారని ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో వసంతను టార్గెట్ చేసుకుని ఈ పోస్టు పెట్టడం ద్వారా జగన్ కూ, ఆయనకూ మధ్య గ్యాప్ పెంచాలని కొందరు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
mylavaram police have started investigation on a complaint from ysrcp mla vasantha krishna prasad regarding fake post on ys jagan hits the mla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X