సీబీఐ కోర్టులో హాజరైన జగన్: ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ కూడా
అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఆయనతోపాటు రాంకీ గ్రూపు ఛైర్మన్ అయోధ్యరామిరెడ్డి, ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్: అక్రమాస్తుల (ఈడీ)కేసు విచారణలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఆయనతోపాటు రాంకీ గ్రూపు ఛైర్మన్ అయోధ్యరామిరెడ్డి, ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఫిర్యాదును విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకున్న ఈడీ హోదాలోని సీబీఐ కోర్టు ముందు ప్రధాన నిందితుడైన జగన్‌తోపాటు ఇండియా సిమెంట్స్ ప్రతినిధిగా బీసీసీఐ మాజీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్, ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్‌దాస్, మాజీ ఐఏఎస్ శామ్యూల్ తదితరులు హాజరయ్యారు.

ఈడీ కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున హాజరు కాలేదు. కాగా, శుక్రవారం న్యాయమూర్తి సెలవులో ఉండటంతో కోర్టు సిబ్బంది వారి హాజరును నమోదు చేసుకుని తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications