నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
ఏపీలో సీఎం వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన వేముల సతీష్ ను పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. జగన్ పై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నంలో భాగంగా నిందితుడు దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే సతీష్ ను అదుపులోకి తీసుుకున్న పోలీసులు.. ఎట్టకేలకు ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాక సెషన్స్ కోర్టులో హాజరుపర్చారు.
జగన్ పై దాడి కేసులో ఏ1 నిందితుడిగా చేర్చిన వేముల సతీష్ తరఫున డిఫెన్స్ లాయర్లు ఆయన ఆధార్ కార్డు ప్రకారం మైనర్ అని విజయవాడ కోర్టులో వాదించారు. అయితే మున్సిపల్ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ లాయర్లు కోరారు. దీంతో కోర్టు అతన్ని మేజర్ గానే పరిగణించి రిమాండ్ రిపోర్టును ఆమోదించింది. అనంతరం సతీష్ ను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పై నెల్లూరు కోర్టుకు తరలించారు.

అలాగే కోర్టులో సతీష్ రాయి విసిరాడన్న కారణంతో అతనిపై 307 కింద కేసు నమోదు చేయడాన్నీ అతని లాయర్ సలీం తప్పుబట్టారు. రాయి విసిరితేనే హత్యాయత్నం కేసు పెడతారా అని ప్రశ్నించారు. కానీ హత్య చేయాలన్న లక్షంతోనే అతను ఉద్దేశపూర్వకంగా దాడి చేశారన్న ప్రభుత్వ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో మే 2 వరకూ రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications