షర్మిలను ఢిల్లీలో లాక్ చేసిన జగన్ - పదవీ గండం..!?
ఎన్నికల్లో ఓటమితో జగన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. గత అయిదేళ్ల కాలంలో జగన్ ఎన్డీఏలో లేకపోయినా అవసరమైన సందర్భాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు రాష్ట్రం లో టీడీపీతో బీజేపీ జత కట్టటంతో జగన్ తన రూటు మార్చారు. ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయానికి వేదికయ్యారు. ఢిల్లీలో తన ధర్నాకు ఇండి కూటమి నుంచి వచ్చిన మద్దతుతో రాజకీయంగా తనను ఇబ్బంది పెడుడున్న షర్మిల పై గురి పెడుతున్నారు.
జగన్ అడుగులు
జగన్ ఓటమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ షర్మిల తాజా ఎన్నికల్లో వ్యవహరించారు. ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా తన టార్గెట్ జగన్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. జగన్ తన ఓటమికి షర్మిల బలమైన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు. దీంతో, ఢిల్లీ ధర్నా ద్వారా కొత్త సమీకరణాలను మొదలు పెట్టారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో..జగన్ ధర్నాకు ఇండి కూటమిలో కాంగ్రెస్ మినహా ఇతర పక్షాలు హాజరై మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో ఇండియా కూటమిలో చేరాలని ఆ నేతలు ఆహ్వానించారు.

కూటమితో కలుస్తారా
కాంగ్రెస్ కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులు..కష్టాల కారణంగా జగన్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు. అయితే, వారి ఆఫర్ ను తిరస్కరిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. దీంతో..జగన్ కాంగ్రెస్ తో సంబంధాల పైన పునరాలోచన చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇటు రాజ్యసభలో జగన్ కు 11 మంది ఎంపీల మద్దతు ఉంది. జగన్ మద్దతు రాజ్యసభలోనూ ఎన్డీఏకూ ఇప్పటికీ అవసరమే. అయితే, తన రాజకీయ ప్రత్యర్ధి టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏకు మద్దతిస్తారా లేదా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
షర్మిలకు బ్రేకులు
ఇదే సమయంలో జగన్ రాజకీయంగా షర్మిల పైన గురి పెడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇండియా కూటమిలో జగన్ ను ఒక వైపు ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రాష్ట్రంలో టార్గెట్ చేయటం ఏంటనే చర్చ కూటమి నేతల్లో మొదలైనట్లు చెబుతున్నారు. ఇటు పీసీసీ చీఫ్ గా షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లోనూ పార్టీ నేతల మద్దతు తగ్గుతోంది. పలువురు షర్మిలకు దూరమయ్యారు. ఏపీలో జగన్ తమతో కలిసి రావాలంటే ముందుగా షర్మిలకు బ్రేకులు వేయాలనే చర్చ ఢిల్లీలో మొదలైంది. దీంతో, షర్మిల విషయంలో కాంగ్రెస్ నిర్ణయం కీలకం కానుంది. ఇక..రాజకీయంగా జగన్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో కలుస్తారా..తటస్థంగానే ఉంటారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications