కుప్పం నుంచి సమర శంఖం పూరించనున్న వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గం నుంచే తన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు గెలుచుకోవాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న సీఎం ఆ దిశగా పార్టీ నాయకులను, కార్యకర్తలను సమాయత్తపరుస్తున్నారు. ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఇప్పటికే ఆయన సమావేశమయ్యారు. జులై 18న ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ నిర్వహించారు.

ycpపై ఆధారపడ్డ కుటుంబాలకు న్యాయం జరగాలి
రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు వైసీపీపై ఆధారపడ్డాయని, వారికి న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోను తిరిగి వైసీపీ అధికారంలోకి రావాలని ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. చురుగ్గా లేరివారికి సీట్లిచ్చేది లేదని, పనితీరు మార్చుకోవడానికి ఆరునెలల సమయమిస్తున్నానని స్పష్టం చేశారు. నాలుగో తేదీ నుంచి నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో సమావేశమవబోతున్నారు. నెలకు 15 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తొలి సమావేశాన్ని కుప్పం నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో ఏర్పాటు చేశారు.

స్థానిక సంస్థల్లో గెలుపొందిన ఊపును కొనసాగించాలి
కుప్పం
స్థానిక
సంస్థల
ఎన్నికల్లో
వైఎస్సార్‌సీపీ
ఘనవిజయం
సాధించింది.
2024
ఎన్నికల్లో
చంద్రబాబు
ఓటమిపాలైతే
రాష్ట్రంలో
టీడీపీ
ఉనికి
కోల్పోయే
అవకాశం
ఉందని,
అందరూ
పట్టుదలగా
పనిచేస్తే
రానున్న
ఎన్నికల్లో
కుప్పం
వైసీపీ
పరమవడం
ఖాయమని
జగన్
స్పష్టం
చేస్తున్నారు.
కార్యకర్తలతో
జరిగే
ప్రతి
సమావేశంలో
మూడేళ్లుగా
ప్రభుత్వం
చేస్తున్న
సంక్షేమం,
అభివృద్ధి,
పరిపాలనపై
వారి
అభిప్రాయాన్ని
తెలుసుకోబోతున్నారు.

మంత్రి పెద్దిరెడ్డిపై బాధ్యత
కుప్పం
బాధ్యతను
మంత్రి
పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డికి
అప్పగించారు.
గత
ఎన్నికల్లో
చంద్రబాబుపై
పోటీచేసి
ఓటమిపాలైన
చంద్రమౌళి
మృతిచెందారు.
ఆయన
కుమారుడు
భరత్
ను
చంద్రబాబు
ప్రత్యర్థిగా
రానున్న
ఎన్నికల్లో
వైసీపీ
బరిలోకి
దింపబోతోంది.
ప్రస్తుతం
ఆయన
ఎమ్మెల్సీగా
ఉన్నారు.
టీడీపీలో
కీలకమైన
నాయకులందరినీ
పార్టీలో
చేర్చుకున్నారు.
ముఖ్యమంత్రి
జగన్
తాను
అనుకున్న
లక్ష్యాన్ని
చేరుకుంటారా?
రానున్న
ఎన్నికల్లో
చంద్రబాబును
ఓటమిపాలు
చేస్తారా?
175
నియోజకవర్గాలకు
175
నియోజకవర్గాలను
గెలుచుకోగలుగుతారా?
అనే
విషయాలపై
స్పష్టత
రావాలంటే
ఎన్నికలు
జరిగి
వాటి
ఫలితాలు
వచ్చేవరకు
ఎదురు
చూడక
తప్పదు.