ఆడబిడ్డలు కన్నీరు పెడితే మంచిది కాదు: జగన్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆడబిడ్డలు కన్నీరు పెడితే మంచిది కాదని ఆయన అన్నారు.
అంగన్‌వాడీ కార్యకర్తులు గురువారంనాడు అనంతపురం జిల్లా కదిరిలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వినిపించారు. చంద్రబాబు ప్రభుత్వం తమతో వెట్టిచాకిరీ చేయిస్తోందని వారు చెప్పుకున్నారు. పనికి తగిన వేతనాలు ఇవ్వడం లేదని చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సభలో ప్లకార్డులు ప్రదర్శించిన 15 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను తొలగించారని వారు చెప్పారు. తమ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వారు జగన్‌ను కోరారు.
ఇప్పటికే అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలపై తాము శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశామని ఆయన గుర్తు చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలపై తాము పోరాడుతామని ఆయన భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications