వంశీ తప్పు చేస్తే శిక్ష: చినరాజప్ప, టిడిపి నేత హోటల్ కోసమే: జగన్ ఆగ్రహం
విజయవాడ: చట్టం దృష్టిలో ప్రతిపక్షమైనా, అధికార పక్షమైనా ఒక్కటేనని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో అదే జరిగిందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం నాడు ఉదయం చెప్పారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని చెప్పారు.
వల్లభనేని తప్పు చేస్తే శిక్ష తప్పదని, వల్లభనేని అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చినరాజప్ప అన్నారు. తని ఘటన పైన సీఐడీ విచారణ జరుగుతోందని చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
లొంగిపోనున్న వంశీ
టిడిపి నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పైన నగరంలోని పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో తానే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు వల్లభనేని సిద్ధమయ్యారు. సోమవారం ఆయన పోలీసులకు సరెండర్ కానున్నారు.
ఆదివారం రామవరప్పాడు పరిధిలోని పేదల పూరి గుడిసెలను మున్సిపల్ అధికారులు తొలగించేందుకు యత్నించారు. ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను ఎలా తొలగిస్తారంటూ అక్కడి స్థానికులు అధికారులను అడ్డుకున్నారు.
విషయం తెలుసుకున్న వామపక్షాల నేతలతో పాటు వంశీ అక్కడకు వెళ్లారు. బాధితుల పక్షాన మాట్లాడిన వంశీ, ఇళ్ల తొలగింపును నిలిపివేయాలని అధికారులను కోరారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని పేదలకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో గుడిసెవాసులతో కలిసి ఆయన నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.

దీనిని తీవ్రంగా పరిగణించిన పటమట పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న ఆయన ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఈ కేసులో తానే స్వయంగా పోలీసులకు సరెండర్ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు ఆయన తన అనుచరులతో కలిసి పటమట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సరెండర్ కానున్నట్లుగా తెలుస్తోంది.
రైవస్ బాధితులకు జగన్ పరామర్శ
రైవస్ బాధితులకు వైసిపి అధినేత జగన్ అండగా నిలబడ్డారు. ఆయన సోమవారం ఉదయం రామవరప్పాడు రైవస్ బాధితులను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోశారు.
పెద్దల కోసం పేదల ఇళ్లను కూల్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ ఇష్టానుసారంగా అలైన్మెంట్ మార్చి ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోందన్నారు. రైవస్ బాధితులకు తాను అండగా ఉంటానని జగన్ చెప్పారు.
వైసిపి ఎమ్మెల్యే, సినీ నటి రోజా సస్పెన్షన్ పైన బుద్ధ ప్రసాద్ కమిటీ సోమవారం నాడు భేటీ అయింది. మరోవైపు, రోజా మూడు రోజుల క్రితం తన సస్పెన్షన్ పైన కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది.
\ఫ్లై ఓవర్ బూచీ చూపి పేదలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఇక్కడ ఉన్న టిడిపి కార్పోరేటర్ హోటల్‌ను కాపాడేందుకు పేదలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. టిడిపి కార్పోరేటర్ హోటల్ తీసివేస్తే పేదలకు ఏ అన్యాయం జరగదన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications