జగన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్
YS Jagan: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ ఆరంభమైంది.. గడువు సమీపించింది. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. 2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఈ సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉందా పార్టీ అగ్రనాయకత్వం. వైనాట్ 175/25 అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోన్నారు. రోడ్ షోలతో హోరెత్తిస్తోన్నారు.
వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ఒకే రోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ రోడ్ షోలను నిర్వహిస్తూ వస్తోన్నారు.
శనివారం నాడు శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా పలమనేరు, నెల్లూరు సిటీలో రోడ్ షోల్లో ప్రసంగించారు వైఎస్ జగన్. నేడు ఎన్నికల ప్రచారానికి జగన్ విరామం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఆయన పల్నాడు జిల్లాలోని రేపల్లె, మాచర్ల, కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గాల్లో రోడ్ షోలను నిర్వహించాల్సి ఉంది.
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో జగన్ నేడు సమావేశం కానున్నారు. పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో పోల్ మేనేజ్‌మెంట్‌పై జగన్ దృష్టి సారించారు. బ్యాలెట్ ఓటింగ్‌పైనా ఆయన ఆరా తీయనున్నారు. బూత్, బ్లాక్ స్థాయిలో పోలింగ్ ప్రక్రియ, ఏజెంట్ల గురించి తెలుసుకోనున్నారు.












Click it and Unblock the Notifications