వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుది డ్రామా-మీడియా ఏదైనా చూపించొచ్చు-వివేకా హత్య టీడీపీ చేసిందేమో- జగన్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీలో ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం జగన్ స్పందించారు. అసెంబ్లీని విపక్ష నేత చంద్రబాబు బాయ్ కాట్ చేసి వెళ్లిపోయిన తర్వాత జగన్ మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఓవైపు అసెంబ్లీలో రైతుల చర్చ జరుగుతుంటే చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబుది డ్రామా అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నిర్ణయంపై జగన్ రియాక్షన్

చంద్రబాబు నిర్ణయంపై జగన్ రియాక్షన్

రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు, ఒకవైపున వర్షాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్న సందర్భాల్లో .. ప్రతిపక్షం వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని, పలానా మాదిరిగా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చని జగన్ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితిని పూర్తిగా పక్కనపెట్టేసి, ప్రజలు ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రజలు ఎలా ఉన్నా అభ్యంతరం లేదు నా ఎజెండా రాజకీయ అజెండానే, ప్రతి అంశంలోనూ... నాకు రాజకీయ లబ్ధి జరగాలి, లబ్ధి చేకూక్చుకునేలా ప్రవర్తిస్తాను అనే ధోరణిలోకి చంద్రబాబుగారు వెళ్లిపోతారని జగన్ ఆక్షేపించారు.

చంద్రబాబుది డ్రామా అన్న జగన్

చంద్రబాబుది డ్రామా అన్న జగన్


అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన తీరు, చేసిన డ్రామా అన్నీ కూడా మన కళ్ల ఎదుటే కనబడ్డాయని జగన్ వ్యాఖ్యానించారు.
అది జరిగేటప్పుడు తాను సభలో లేనన్నారు. తాను సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్షచేశానని, సభకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలుసుకున్నానని జగన్ తెలిపారు. తాను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని జగన్ వెల్లడించారు. చంద్రబాబుకు పొలిటికల్‌ అజెండానే ముఖ్యమని, చంద్రబాబుమీద తాము వ్యతిరేకంగా ఉన్నామని ప్రజలు తీర్పిచ్చారని జగన్ పేర్కొన్నారు.

 చంద్రబాబు ఫ్రస్టేషన్ కు కారణమిదే

చంద్రబాబు ఫ్రస్టేషన్ కు కారణమిదే

చంద్రబాబు తాజా ఎన్నికల్లో ఊహించని విధంగా ప్రజల వ్యతిరేకత చూశారని, మండలిలో కూడా వారికున్న బలం పూర్తిగా మారిపోయిందని జగన్ తెలిపారు. మండలిలో కూడా వైయస్సార్‌సీపీ బలం గణనీయంగా పెరిగిందన్నారు. కౌన్సిల్‌ ఛైర్మన్‌గా వైయస్సార్‌సీపీకి చెందిన తన సోదరుడు, దళితుడు రాబోతున్నాడన్నారు. ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారని జగన్ వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడుతున్నారో ? ఏం చేస్తున్నారో ఆయనకు అర్థంకావడంలేదన్నారు.

చంద్రబాబు అన్నారనే

చంద్రబాబు అన్నారనే

సంబంధంలేని టాపిక్‌ను చంద్రబాబు సభలోకి తీసుకొస్తారని, దాన్ని ఖండిస్తూ అధికార పక్షంనుంచి కూడా కొంతమంది మాట్లాడతారని, తానంతట తానే సభలో వాతావరణాన్ని చంద్రబాబు రెచ్చగొడతారని జగన్ అన్నారు. సహజంగానే దానికి స్పందిస్తూ అధికార పక్షంనుంచి మాట్లాడతారని, చంద్రబాబు చెప్తున్నట్టుగా అలాంటి మాటలేవీ అధికారపక్షం నుంచి మాట్లాడలేదన్నారు. మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రత్యారోపణలుగా నాడు టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన రంగా గారి హత్య అయితేనేమి, మాధవరెడ్డిగారి హత్య అయితేనేమి, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖపైకూడా చర్చజరగాలని అధికారపార్టీ సభ్యులు అన్నారని జగన్ తెలిపారు. చంద్రబాబు రెచ్చగొడుగుతున్నారు కాబట్టే ఈ మాటలన్నారని జగన్ వెల్లడించారు.

 రికార్డులు చూసుకోవచ్చన్న జగన్

రికార్డులు చూసుకోవచ్చన్న జగన్

ఎక్కడా కూడా కుటుంబ సభ్యులగురించి అధికార పక్ష సభ్యులు మాట్లాడలేదన్నారు. కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబు మాట్లాడారు తప్ప, ఇంకెవ్వరూడా కూడా మాట్లాడలేదన్నారు.తన చిన్నాన్న గురించి, తన అమ్మగురించి, చెల్లెలు గురించి చంద్రబాబే ప్రస్తావించారని జగన్ తెలిపారు. అధికారపక్షంనుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదన్నారు. సభ రికార్డులు చూసినా ఇది అర్థం అవుతుందన్నారు. మా వాళ్లు అందరూ కూడా ఇదే చెప్పారని జగన్ పేర్కొన్నారు.

దేవుడు చూస్తున్నాడన్న జగన్

దేవుడు చూస్తున్నాడన్న జగన్

వెళ్లిపోతూ, వెళ్లిపోతూ చంద్రబాబు శపథాలు చేశారని, ఇవన్నీ కళ్లముందే చూశామని జగన్ తెలిపారు.. ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడన్నారు. తాను అయినా, ఎవరైనా అంతా నిమిత్త మాత్రులమేనన్నారు. దేవుడు ఎంతకాలం అయితే ఆశీర్వదిస్తాడో.. అంతకాలం మనం పనిచేయగలుగుతామన్నారు. దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు రాజకీయాల్లో ముఖ్యమన్నారు. ఎంతకాలం మనం మంచి చేస్తే.. దేవుడు ఆశీర్వదిస్తాడు.. ఆ మంచి జరిగిన కాలం ప్రజలు ఆశీర్వదిస్తారని జగన్ తెలిపారు.
ఆ రెండూ ఉన్నంతకాలం.. ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు, ఇది వాస్తవమని జగన్ అన్నారు.

మీడియా తోడు లేకపోవచ్చు కానీ

మీడియా తోడు లేకపోవచ్చు కానీ


తనకు ఈనాడు లాంటి పెద్ద సంస్థ తోడుగా లేకపోవచ్చని, ఆంధ్రజ్యోతి లాటి పత్రిక తనకు లేకపోవచ్చని, టీవీ-5 లాంటి సంస్థ లేకపోవచ్చని, ఇంత మంది సంఖ్య నాకు లేకపోవచ్చని జగన్ చెప్పుకొచ్చారు. అబద్ధాన్ని నిజం చేసేందుకు, చెప్పిందే చెప్పి దాన్ని నిజంచేయడానికి ఈ మేథావులు ప్రయత్నిస్తారని జగన్ ఆరోపించారు. గోబెల్స్‌ ప్రచారంలో వీళ్లు దిట్టలని,
వీళ్లు ఏ అబద్ధం చెప్పినా దాన్ని నిజం చేయడానికి రాతలు రాస్తారని, స్క్రోలింగ్స్‌ వేస్తారు, టీవీల్లో చూపిస్తారు, మీడియాలో వీరి సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఏమైనా చేస్తారని ఆక్షేపించారు. కానీ నిజం మాత్రం దాచలేరన్నారు. ప్రజలకు మంచి జరుగుతుందా? లేదా? అన్నదాన్ని మార్చలేరన్నారు. ప్రజలకు మంచి జరిగినంత కాలం, చంద్రబాబుగారు ఎంత డ్రామాలు చేసినా, చంద్రబాబుగారి కళ్లల్లో నీళ్లు తిరక్కపోయినా తిరిగినట్టుగా, తనంతట తానే డ్రామాలు చేయొచ్చు.. ఇలా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని జగన్ అన్నారు. దీన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లు ఏదో జరిగిపోయిందని చూపించవచ్చన్నారు.
ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా వాళ్లే చెప్పేయొచ్చన్నారు. ఆయనే అన్ని మాటలు మాట్లాడతాడు, ఆయనే డ్రామా చేస్తాడు:
ఎలాంటి మాటలు మాట్లాడకపోయినా... మాట్లాడినట్టు చూపించవచ్చని జగన్ తెలిపైారు. ఏమైనా జరగొచ్చన్నారు.:
కాని చిట్టచివరిగా దేవుడు ఇవన్నీ చూస్తాడన్నారు. ప్రజలు చూస్తూ ఉన్నారని, దేవుడి దయ, ప్రజల దీవెన ఉన్నంతకాలం.. ఇలాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇలాంటి టీవీ-5లు ఎంత చంద్రబాబుగారిని మోసినా.. అంతిమంగా మంచే విజయం సాధిస్తుందన్నారు.

 వివేకా హత్య టీడీపీ చేసి ఉండొచ్చన్న జగన్

వివేకా హత్య టీడీపీ చేసి ఉండొచ్చన్న జగన్

చంద్రబాబు మాటలు చూస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుందని జగన్ తెలిపారు. తన చిన్నాన్నగురించి చంద్రబాబుగారు మాట్లాడతారని, వివేకాగారు నాకు చిన్నాన్న, చంద్రబాబుగారికి కాదన్నారు. సొంత మా నాన్న తమ్ముడన్నారు. ఇంకోవైపు అవినాష్‌రెడ్డిపైన ఆరోపణలు చేస్తున్నారని, అవినాష్‌రెడ్డి మరో చిన్నాన్న కొడుకన్నారు. ఎవరైనా అలాంటి ఘటన ఎందుకు చేస్తారు అధ్యక్షా అని జగన్ ప్రశ్నించారు. మన చేయితో మనకున్న కంటిని ఎందుకు పొడుచుకుంటామని ప్రశ్నించారు.
వివేకా గారి హత్య జరిగింది చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడని గుర్తుచేశారు అప్పుడు తాముప్రతిపక్షంలో ఉన్నారన్నారు. తన చిన్నాన్న, అవినాష్‌రెడ్డి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారని జగన్ తెలిపారు. మా చిన్నాన్నను ఓడించడం కోసం టీడీపీ చేసిన అక్రమాలు అన్నీఇన్నీకావని జగన్ వెల్లడించారు. కడప జిల్లాలో అప్పుడు ఎంపీటీసీలు, జడ్పీసీలు తమకుప ఎక్కువ ఉన్నారని, తాము ఎక్కడ గెలిచినా కూడా.. తమ పార్టీ నుంచి చినాన్నన్నను మాపార్టీ నుంచి పోటీపెడితే.. బలవంతంగా మా ఎంపీటీసీలను, జడ్పీటీసీలను డబ్బు ఇచ్చి ప్రలోభాలు పెట్టి, స్పెషల్‌ ఫ్లైట్‌లు పెట్టి , పోలీసులను పెట్టి, కుయుక్తులను పన్ని.. ఇలా రకరకాలుగా అక్రమాలు చేసి చిన్నాన్నను ఓడించారని గుర్తుచేసారు.
మా చిన్నాన్నను ఏదైనా చేసి ఉంటే.. అది వాళ్లే చేసి ఉండాలన్నారు. అటువంటి దాన్ని ట్విస్ట్‌చేసి, వక్రీకరించి.. ఏదేదో చేస్తున్నారని జగన్ ఆరోపించారు. చివరకు మాకుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలను చేస్తున్నారన్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుందన్నారు.

English summary
andhrapradesh chief minister ys jagan on today reacted on opposition leader chandrababu's assembly boycott decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X