Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆదిత్యనాథ్ దాస్ కు బంపర్ ఆఫర్- రిటైర్మెంట్ తర్వాత జగన్ సలహాదారుగా ఎంట్రీ ?

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. ఇప్పటికే ఓసారి ముూడు నెలలు పొడిగించిన ఆయన పదవీకాలాన్ని మరోసారి పొడిగించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయన రిటైర్ కాక తప్పని పరిస్ధితి. అయితే ప్రభుత్వ పాలనతో ఆయనకున్న విశేషమైన అనుభవాన్ని భవిష్యత్ అవసరాలకు వాడుకోవాలని సీఎం జగన్ నిర్ణయించడంతో ఆయనకు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ రిటైర్మెంట్

సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ రిటైర్మెంట్

ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ ఏడాది జనవరిలో ఆ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆరునెలల్లోనే ఆయన రిటైర్ కావడంతో ఆయనకు మూడు నెలల పాటు ప్రభుత్వం పదవీకాలం పొడిగింపు ఇచ్చింది. దీంతో ఆయన ఈ నెలాఖరు వరకూ పదవిలో ఉండేందుకు అవకాశం దొరికింది. ఈ నెలాఖరు తర్వాత కూడా దాస్ కు మరోసారి పొడిగింపు ఉంటుందని భావించినా ప్రభుత్వం మాత్రం అందుకు మొగ్గు చూపలేదు. తాజాగా చోటు చేసుకున్న కొన్ని వివాదాలు, వాటిని పరిష్కరించడంలో ఆయన సున్నితంగా వ్యవహించారనే కారణంతో ఆయనపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దాస్ ను ఈ నెలాఖరుతో సాగనంపాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చేసినట్లు తెలుస్తోంది.

 ఆదిత్యనాధ్ దాస్ కు బంపర్ ఆపర్

ఆదిత్యనాధ్ దాస్ కు బంపర్ ఆపర్

ఈ ఏడాది జనవరిలో సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాధ్ దాస్ కు వైఎస్ కుటుంబ విధేయుడిగా పేరుంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యవహారాల్లో విశేషానుభవం ఉంది. అన్నింటికంటే మించి ఏపీ-తెలంగాణ మధ్య ప్రస్తుతం సమస్యగా మారిన జల వివాదాలపై ఆయనకు పూర్తిగా పట్టుంది. దీంతో ఆయన్ను జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి సీఎస్ గా ప్రమోషన్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం తన పదవీకాలం ముగిసిపోవడం, తిరిగి మూడు నెలలు ఎక్స్ టెన్షన్ ఇవ్వడం, అది కూడా పూర్తికావడంతో దాస్ రిటైర్ కాక తప్పని పరిస్ధితి. అయితే ఆయన కెరీర్ గ్రాఫ్ ను దృష్టిలో ఉంచుకని సీఎం జగన్ ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 జలవనరుల సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ ?

జలవనరుల సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ ?

సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ గతంలో ప్రభుత్వంలోని కీలక విభాగాలన్నింటిలోనూ పనిచేశారు. విద్యాశాఖ, జలవనరులశాఖతో పాటు పలు జిల్లాల కలెక్టర్ గానూ వ్యవహించారు. అయితే అన్నింటికంటే జలవనరులశాఖలో ఆయనకు పట్టున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జలవనరుల శాఖలో దాస్ కు ఉన్న విశేష అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు ప్రధాన సలహాదారు బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున ఆయన రిటైర్మెంట్ తర్వాత అక్టోబర్ 1 నుంచి సీఎంకు జలవనరుల వ్యవహారాల్లో సలహాదారుగా దాస్ కు బాధ్యతలు అప్పగించబోతున్నారు.

 జలవనరుల శాఖలో దాస్ అనుభవం ఇదే

జలవనరుల శాఖలో దాస్ అనుభవం ఇదే

సీఎస్ గా ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్న ఆదిత్యనాధ్ దాస్ కు జలవనరులశాఖలో పదేళ్ల పాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. వైఎస్ హయాంలో జలయజ్ఞం ప్రాజెక్టుల పర్యవేక్షణతో పాటు తాజాగా ఏపీృ-తెలంగాణ మధ్య సాగుతున్న జలవివాదాలు, వాటి నేపథ్యం, పరిష్కారాలు వంటి అంశాల్లో దాస్ కు ఉన్న అనుభవం ప్రభుత్వంలో మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో దాస్ సేవల్ని ఏదో విధంగా వాడుకోక తప్పని పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురవుతోంది. అందుకే ఆయన్ను సీఎం జగన్ కు జల వనరుల వ్యవహారాల సలహాదారుగా నియమించేందుకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తికాకపోవడం, మరో కీలకమైన ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ నిర్మించక తప్పని పరిస్ధితులు, కొత్త ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై అడుగులు వేయాల్సిన పరిస్ధితి.. ఇలా ఎన్నో అంశాలు దాస్ అనుభవం ప్రభుత్వానికి పనికొచ్చేలా చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+