వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకున్నా; రొట్టెల పండుగలో అనిల్ కుమార్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కులమతాలకతీతంగా నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెత్తిన టోపీ పెట్టుకుని, మెడపై శాలువా వేసుకుని అచ్చం ముస్లిం వేషధారణలో బారాషహీద్ దర్గా దగ్గరకు చేరుకుని రొట్టెల పండుగలో పాల్గొన్నారు.

జగన్ సీఎం కావాలన్న కోరిక తీరిందని మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

జగన్ సీఎం కావాలన్న కోరిక తీరిందని మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్


ఈ సందర్భంగా ఆయన గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రొట్టెలు పట్టుకున్నానని చెప్పిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తన కోరిక నెరవేరిందని అందుకే రొట్టెను స్వర్ణ చెరువులో విడిచిపెట్టి మొక్కులు చెల్లించుకున్నాను అని తెలిపారు. రొట్టెల పండుగ సందర్భంగా తాను కోరుకున్న కోరికలు నెరవేరాయని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.

రొట్టెల పండుగలో మళ్ళీ మూడు కోరికలు కోరుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

రొట్టెల పండుగలో మళ్ళీ మూడు కోరికలు కోరుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్


రొట్టెల పండుగలో పాల్గొన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ తాను రొట్టెల పండుగ సందర్భంగా ఈ సారి మరో మూడు కోరికలు కోరుకున్నట్టు వెల్లడించారు. జగన్ రెండోసారి సీఎం కావాలని తాను కోరుకుంటున్నానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నా అని, జర్నలిస్టులు అందరూ తమ వృత్తిలో రాణించాలని కూడా తాను కోరుకున్నానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.

 తన కోరిక నెరవేరితే మళ్ళీ మొక్కులు తీర్చుకుంటా అంటున్న మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్

తన కోరిక నెరవేరితే మళ్ళీ మొక్కులు తీర్చుకుంటా అంటున్న మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్


ఈ కోరికలతో తాను రొట్టెలు పట్టుకున్నాను అని పేర్కొన్నారు. తన కోరిక నెరవేరితే మళ్లీ రొట్టెలు విడిచి పెడతానని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.
మొహరం పర్వదినాలలో హిందూ ముస్లింలు కలిసికట్టుగా నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుకుంటూ, నెరవేరిన కోర్కెలకు మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ, పుచ్చుకుంటూ రొట్టెల పండుగ జరుపుకుంటారు. ఈ రొట్టెల పండుగలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొంటారు. మూడు రోజులపాటు రొట్టెల పండుగలో పాల్గొనడం కోసం దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు.

 రొట్టెల పండుగలో ఏదైనా కోరుకుంటే తప్పక తీరుతుంది

రొట్టెల పండుగలో ఏదైనా కోరుకుంటే తప్పక తీరుతుంది

ఇక ఈ రొట్టెల పండుగలో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందని స్థానికంగా ఉన్న వారు చాలా దృఢంగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వైయస్ జగన్ సీఎం కావాలని రొట్టెల పండుగ సందర్భంగా కోరుకున్నారు. ప్రస్తుతం ఆ కోరిక తీరడంతో మొక్కు చెల్లించుకోవడంతో పాటు, తిరిగి మళ్లీ జగన్ సీఎం కావాలని మరో మూడు కోరికలను కోరుకున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+