సీబీఐకి షాకిచ్చిన జగన్..! సెల్ ఫోన్ కేసులో బిగ్ ట్విస్ట్..!
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు బెయిల్ నిబంధనల సడలింపు కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కోర్టు ఆమోదించడంతో ఆయన 10 రోజుల పాటు లండన్ టూర్ కు వెళ్లి తిరిగి వచ్చారు. అయితే ఆ లోపే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ పై సీబీఐ అధికారులు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆయన సెల్ ఫోన్ నంబర్ విషయంలో అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే ఆ లోపే జగన్ తిరిగి వచ్చేశారు.
జగన్ సీబీఐ కోర్టు అనుమతితో ఇప్పటికే పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చారు. అయితే ఈసారి లండన్ టూర్ కు వెళ్లే సమయంలో కోర్టు షరతుల మేరకు సీబీఐకి సమర్పించిన సెల్ ఫోన్ నంబర్ వివాదానికి కారణమైంది. గతంలో ఇచ్చిన నంబర్ వేరేది కావడం, ఈసారి ఇచ్చిన నంబర్ కొత్తది కావడంతో దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆలోపే జగన్ విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో చేసేది లేక సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

జగన్ బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారని, తమకు అందుబాటులో ఉండేందుకు ఇచ్చిన ఫోన్ నంబర్ మార్చి ఇచ్చారని అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని కూడా వాదించింది. అయితే జగన్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో తాజాగా సీబీఐ కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. ఇందులో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లు సీబీఐ వాదించగా.. అసలు జగన్ సెల్ ఫోనే వాడటం లేదని ఆయన లాయర్లు కోర్టుకు తెలిపారు. దీంతో సీబీఐ షాకైంది.

జగన్ అసలు సెల్ ఫోన్ వాడటం లేదని, సీబీఐకి అందుబాటులో ఉండేందుకు ఓ మొబైల్ నంబర్ ఇచ్చారని సీబీఐ కోర్టుకు ఆయన లాయర్లు తెలిపారు. కానీ సీబీఐ మాత్రం బెయిల్ షరతులు ఉల్లంఘించారని, గతంలో ఇచ్చిన నంబర్, ఈసారి ఇచ్చిన నంబర్ ఒకటి కాదని వాదించింది. దీంతో సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. వాదనలు పూర్తి చేసి ఈ వ్యవహారంలో ఈ నెల 28న తీర్పు ఇస్తామని వెల్లడించారు. దీంతో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారా లేదా అనేది 28న తేలనుంది.












Click it and Unblock the Notifications