YSRCP Manifesto: వైసీపీ మ్యానిఫెస్టోను తేల్చేయబోతున్న జగన్ - సీనియర్లకు పిలుపు..!
ఏపీలో గతంలో ఎన్నికల మ్యానిఫెస్టో అంటే పార్టీలు, ఓటర్లు లైట్ తీసుకునే పరిస్ధితి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసే స్ధాయికి తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్ ఈసారి కూడా ఎన్నికల కోసం మ్యానిఫెస్టో రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈసారి మ్యానిఫెస్టోలో ఇచ్చే పలు హామీలపై ఓ అంచనాకు వచ్చేసిన సీఎం జగన్ వాటిని ఖరారు చేసేందుకు ఇవాళ పార్టీ సీనియర్లతో భేటీ కాబోతున్నారు.
గతంలో 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని దాదాపుగా అమలు చేసేసిన సీఎం జగన్.. ఇప్పుడు కొత్త హామీలపై దృష్టిపెట్టారు. ఇందులో డ్వాక్రా రుణమాఫీ, పింఛన్ల పెంపు సహా మహిళలకు కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటి వివరాలు బయటికి రాకపోయినా కచ్చితంగా ఈసారి కూడా ప్రజాకర్షక పథకాలతోనే జనంలోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని ఫైనల్ చేసి త్వరలో మ్యానిఫెస్టో ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ తాడేపల్లికి రావాలని వైసీపీ సీనియర్లకు పిలుపువచ్చింది. ముఖ్యంగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు తెలిసింది. వీరితో మ్యానిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై తుది చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది.
అనంతరం దీన్ని ఖరారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రకటించేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు. గతంలోనూ చాలా ముందుగా మ్యానిఫెస్టో ప్రకటించి జనంలోకి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వైసీపీ అందుకు తగ్గ ఫలితాలు రాబట్టుకుంది.












Click it and Unblock the Notifications