జగన్ జిల్లాల యాత్ర.. పార్టీ ప్లీనరీ, ముహూర్తం ఫిక్స్ - ఇక యాక్షన్ మోడ్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలతో సిద్దమయ్యారు. రాజకీయంగా తిరిగి బలోపేతం కావటం పైనే ఫోకస్ చేసారు. అందులో భాగంగా జిల్లాల పర్యటనలకు ముహూర్తం ఖరారు అయింది. అదే సమయంలో వరుసగా పార్టీ కేడర్ తోనూ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. పార్టీ ప్లీనరీ పైన జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మరో విడత పాదయాత్ర పైన ప్రకటన చేసారు. ఇక పూర్తిగా తాడేపల్లి కేంద్రంగా రాజకీయ కార్యాచరణకు జగన్ సిద్దమయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తన కార్యాచరణ ఖరారు చేసారు. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత బెంగళూరు లో ఉంటూ.. వారంలో మూడు రోజులు తాడేపల్లి లో అందుబాటులో ఉంటున్నారు. కాగా, ఇక నుంచి పూర్తిగా పార్టీకే కేటాయించాలని జగన్ డిసైడ్ అయ్యారు. కొన్ని నెలల క్రితమే జిల్లాల పర్యటనలు.. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కేడర్ తో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

అయితే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకుండా పర్యటనలు చేయటం సరికాదనే అభిప్రాయంతో వాయిదా వేసుకున్నారు. పార్టీ నేతలతో భేటీలు .. సమావేశాలు.. పరామర్శలకు పరిమితం అయ్యారు. ఇక.. మారుతున్న రాజకీయ సమీకరణాలతో జగన్ తన వ్యూహం మార్చారు. ఇక నుంచి పార్టీకి పూర్తి సమయం కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా జిల్లాల యాత్ర షెడ్యూల్ పై కసరత్తు జరుగుతోంది.
జగన్ జనవరి తొలి వారం నుంచి జిల్లాల యాత్రలకు సిద్దం అవుతున్నారు. ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మూడు రోజులు ఉండనున్నారు. పార్టీ కేడర్ తో సమావేశంతో పాటుగా.. సాధారణ ప్రజలతో కలిసేలా షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. 2026 జూన్ నెలాఖరు లోగా తొలి విడత జిల్లాల యాత్రలను ముగించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. జూలై 8,9 తేదీల్లో మంగళగిరి సమీపంలో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలకు జగన్ ఇప్పటికే సూచన చేసారు. జిల్లాల పర్యటన సమయంలోనే ప్రజా సమస్య లు.. ప్రభుత్వ నిర్ణయాల పైన దీక్షలు.. నిరసనలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

2027 జూలై నుంచి రెండో విడత పాదయాత్రకు జగన్ సిద్దం అవుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఈ నిర్ణయాలు అమలు చేయనున్నారు. ఇక.. 2027 జూలై నుంచి 2029 వరకు పాదయాత్ర కొనసాగనుంది. వచ్చే రెండు నెలల కాలంలో బూత్ లెవల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటు.. ముఖ్య నేతల బాధ్యతల్లో మార్పులు పూర్తి చేయాలని జగన్ నిర్ణయించారు. వచ్చే వారం పార్టీ కీలక నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో త కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications