వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కలెక్టర్ల సమావేశం .. పక్కా ఇళ్ళ విషయంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో తొలిసారి సమావేశం నిర్వహిస్తున్నారు . ఉండవల్లిలోని ప్రజావేదికలో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన ఈ సమావేశాలు రెండురోజులపాటుజరగనున్నాయి . ఇక ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నవరత్నాల అమలు ఎజెండాగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది . అలాగే పక్కా గృహాల విషయంలో కూడా కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.

చంద్రబాబు వెన్నుపోటుకు.. ఎంపీల పిరాయింపుకు లింకు పెట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!?చంద్రబాబు వెన్నుపోటుకు.. ఎంపీల పిరాయింపుకు లింకు పెట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!?

 జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ తొలిసారి భేటీ .. రెండు రోజుల పాటు కొనసాగనున్న సమావేశాలు

జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ తొలిసారి భేటీ .. రెండు రోజుల పాటు కొనసాగనున్న సమావేశాలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల వివిధ శాఖలలో ఐ ఏ ఎస్ ల బదిలీ చేసిన చంద్రబాబు ఇక తాజాగా జిల్లా కలెక్టర్ లతో భేటీ అవుతున్నారు. ప్రజావేదికలో జరుగుతున్న ఈ భేటీలో తొలిరోజు పౌరసరఫరాల డోర్‌ డెలివరీ, కరువు పరిస్థితులు, వ్యవసాయం, పశుపోషణ, ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, పాఠశాల విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ, గ్రామ వలంటీర్ల వ్యవస్థ, పాలనలో పారదర్శకత, విద్యుత్‌, మంచినీరు, నిరుపేదల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

బడ్జెట్ లో ప్రతీ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో జగన్

బడ్జెట్ లో ప్రతీ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో జగన్

రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ జిల్లాల్లో గల ప్రాధాన్యత అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి వివరాలు తీసుకోనున్నారు . అంతే కాదు త్వరలో బడ్జెట్‌ సమావేశం జరగనుండడంతో ఈ సమావేశాలకు అవసరమైన సమాచారాన్ని అధికారుల నుంచి సేకరించి అందుకు అనుగుణంగా జిల్లాలకు నిధుల కేటాయింపు చేయాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం జగన్ .

పక్కా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం

పక్కా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో 8.5 లక్షల మంది అర్హత కలిగిన లబ్ధిదారులకు పుక్కా ఇళ్ల కేటాయింపుకు సంబంధించి జగన్ భారీ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. జగన్ నిర్మాణ ఖర్చులు, నిర్మాణ సమయం మరియు భూమి కేటాయింపు అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్నారని సమాచారం . ఈ పక్కా గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి, ఉగాది పండుగ వరకు లబ్ధిదారులకు అప్పగించాలనే ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తుంది . జగన్ ఈ విషయంలో కలెక్టర్లతో సమావేశం అనంతరం ఈ పథకం యొక్క ముఖ్య వివరాలను ఈ రోజు లేదా రేపు అధికారిక ప్రకటన చేయవచ్చు అని సమాచారం.

English summary
YS Jagan Mohan Reddy will be hosting a collectors’ conference in Amaravati today. Various topics like the implementation of Navaratnalu, old-age pension, and home delivery of ration products will be coming to discussion in this meeting.Also, Jagan is expected to make a massive announcement regarding the allotment of pucca houses to 8.5 lakh eligible beneficiaries in Andhra Pradesh.Jagan will be discussing about the construction costs, construction time, and land allotment procedures with collectors.The plan is to complete the construction of these pucca houses and hand them over to the beneficiaries by coming Ugadi. Jagan might make an official announcement in the regard and reveal the key details of this scheme either today or tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X