బిజెపి కీ ఇస్తే బాబు జైల్లో, తలరాత మారనుంది: ఓటుకు నోటుపై జగన్, సంచలన వ్యాఖ్య
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లంచాలు తీసుకొని, వాటి ద్వారా వచ్చిన డబ్బులతో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అక్కడి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని, అందుకే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ అన్నారు.
ప్రత్యేక హోదా కోసం తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో జరిగిన యువభేరీ సదస్సులో మంగళవారం నాడు జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డాడని, హోదా కోసం చంద్రబాబు పట్టుబడితే బిజెపి కీ ఇస్తే, చంద్రబాబు జైలుకెళ్తారని, అందుకే ఆయన మాట్లాడటం లేదన్నారు.
నాడు మీరు కూడా ఇక్కడే...
ఎస్వీయులో రాజకీయ సమావేశాలు వద్దని ప్రభుత్వం తమకు మొదట అనుమతించలేదని, కానీ గతంలో టిడిపి లెజిస్లేచర్ సమావేశం, గతంలో మోడీ ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడే సమావేశాలు పెట్టిన విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. హోదా కోసం ఢిల్లీ వెళ్తామని, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడుతామన్నారు.

చంద్రబాబు ఏం చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా పైన హామీ మనకు ఏ పరిస్థితుల్లో ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. పార్లమెంటులో ఏదైనా మాట చెబితే, అది అమలవుతుందని మనం భావిస్తామని కానీ పార్లమెంటులో.. ప్రధాని ఇచ్చిన హామీ, విపక్షాలు మద్దతు పలికిన హామీ.. హోదా అన్నారు.
ఇదేనా ప్రజాస్వామ్యం
అలాంటి హామీకి ఇప్పుడు దిక్కు లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇది ఉదాహరణ అన్నారు. పార్లమెంటు హామీ నెరవేర్చక పోవడంతో... భారతీయులం అయినందుకు సిగ్దుతో తలదించుకోవాల్సి వస్తుందన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు.
హామీలను నీటిబుడగల్లా మార్చుతున్నారన్నారు. కేంద్రమంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. బిజెపి ఐదేళ్లు కాదని.. పదేళ్లకు హోదా కోసం పట్టుబట్టిందని, కానీ ఇప్పుడు దానిని నెరవేర్చడం లేదన్నారు. చంద్రబాబు కూడా హోదా రాకుంటే ఏమిటన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నిలదీయడం లేదెందుకు?
ప్రత్యేక హోదా ఇస్తారో, ఇవ్వరో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. హోదా కోసం చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. తనతో పాటు చాలామందికి ఈ అనుమానాలు వచ్చాయన్నారు. కేంద్రంలో చంద్రబాబు పార్టీకి చెందిన మంత్రులు ఉన్నారని, బిజెపిపై ఒత్తిడి తేవాలన్నారు.

బాబూ! బిజెపికి అల్టిమేటం జారీ చేయాలి.. కానీ ఓటుకు నోటు వల్ల చేయరు
బిజెపికి చంద్రబాబు అల్టిమేటం జారీ చేయాలన్నారు. నెల రోజులు గడువిస్తున్నా.. ఆ లోగా హోదా ప్రకటించకుంటే మేం ప్రభుత్వం నుంచి మంత్రులను ఉపసంహరించుకుంటామని డెడ్ లైన్ విధిస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. కానీ ఆయన అలాంటి అల్టిమేటం జారీ చేయరన్నారు.
ఈ మద్య ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కున్నారని అభిప్రాయపడ్డారు. పట్టిసీమ నుంచి పోలవరం దాకా ఎన్నింటిలోనే ఏపీలో లంచాలు తీసుకొని.. దాని ద్వారా వచ్చిన డబ్బులతో పక్క రాష్ట్రంలోని తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ఎమ్మెల్సీలను గెలిపించుకునే ప్రయత్నం చేశారన్నారు.
అందుకు సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలతో అడ్డంగా దొరికారన్నారు. అందుకో ప్రత్యేక హోదా పైన మాట్లాడటం లేదన్నారు. హోదా పైన బిజెపి పైన ఒత్తిడి తెస్తే, బిజెపి కీ ఇస్తుందని, దీంతో, ఆయన జైలుకు పోతారన్నారు.
చంద్రబాబు తలరాత మారే సమయం ఆసన్నమైంది
చంద్రబాబు తలరాత మారే సమయం ఆసన్నమైందని, అందుకు దేవుడు కూడా సహకరిస్తాడని జగన్ అన్నారు. తప్పుడు హామీలు, తప్పుడు స్లోగన్లతో అధికారంలోకి వచ్చిన బాబును ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. దేవుడు ప్రజల పక్షాన ఉన్నాడని, బాబు అక్రమాలు సహించే స్థితిలో ఆయన లేడన్నారు.
చంద్రబాబు చెప్పిన అబద్ధాలే ఆయన్ను అధికార పీఠం నుంచి కిందకు లాగేస్తాయన్నారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఉద్యమించాలన్నారు. చరిత్రను తిరగరాసిన అన్ని ఉద్యమాలూ యూనివర్శిటీలే వేదికగా పుట్టాయని గుర్తు చేశారు. విద్యార్థి ఉద్యమాలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు.
పేరుపేరునా పలకరించిన జగన్
జగన్ ప్రసంగానికి విద్యార్థులు కేరింతలు కొట్టారు. అంతకుముందు జగన్ విద్యార్థి సంఘాల నేతలను పేరు పేరునా ప్రస్తావించారు. ఆయనను ఎస్వీ వర్శిటీ యువత చప్పట్లతో స్వాగతించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications