వైసీఎల్పీలో ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం-కేబినెట్ బెర్తుల నుంచి ఇన్ ఛార్జ్ ల దాకా- టార్గెట్ 2024
ఏపీలో అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్న సందర్భంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ, కేబినెట్ మార్పులు, ఇన్ ఛార్జ్ లు, 2024 ఎన్నికల దిశగా కీలక నిర్ణయాలపై ఇవాళ సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. దాదాపు గంటకు పైగా సాగిన భేటీలో సీఎం జగన్.. తాజా పరిస్ధితులను ఎమ్మెల్యేలకు వివరించడంతో పాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 2019 ఎన్నికల విజయాన్ని 2024లోనూ రిపీట్ చేయాలంటే ఏం చేయాలనే దానిపై జగన్ దిశానిర్దేశం చేశారు.

వైసీఎల్పీ భేటీ
ఏపీలో 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్.. 2024లోనూ దాన్ని రిపీట్ చేసేందుకు వీలుగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో వైసీఎల్పీ భేటీ నిర్వహించారు. ఇందులో సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. ఇందులో చాలా విషయాల్ని ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో అధికారం నిలబెట్టుకోవాలంటే ఎమ్మెల్యేలు ఏం చేయాలనే దానిపై జగన్ చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పాత మోడల్లోనే కేబినెట్
అధికారంలోకి రాగానే చేపట్టిన కేబినెట్ విస్తరణలో ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు మహిళా హోంమంత్రికి అవకాశం కల్పించిన జగన్.. ఇప్పుడు మరోసారి అదే మోడల్ ను రిపీట్ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త కేబినెట్ లోనూ అదే సామాజిక సమీకరణాలతో, మహిళా సమీకరణాలతో ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. దీంతో పాత కేబినెట్ సమీకరణాలతోనే కొత్త కేబినెట్ ఏర్పాటు కానుంది. ఈ కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ క్లారిటీఇచ్చేశారు.

ఉగాదికి కేబినెట్, 27న మంత్రుల రాజీనామా
ఈ ఉగాదికి అంటే ఏప్రిల్ 2న కేబినెట్ ప్రక్షాళన చేపట్టాలని జగన్ నిర్ణయించారు. ఉగాదికి కొత్త జిల్లాల్ని అమల్లోకి తెచ్చేందుకు ఇఫ్పటికే ఆదేశాలు ఇచ్చిన జగన్.. ఇప్పుడు కేబినెట్ విస్తరణకూ ఉగాదినే ముహుర్తంగా నిర్ణయించారు. తెలుగు సంవత్సరాది ప్రారంభం సందర్భంగా కొత్త జిల్లాల్లో కొత్త మంత్రులతో కొత్త కేబినెట్ పని చేయడం ప్రారంభించేలా జగన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం ముందస్తుగానే ఈ నెల 27న ప్రస్తుత కేబినెట్లో ఉన్న మంత్రులతో రాజీనామాలు చేయించబోతున్నారు.

ఐదారుగురికే కొనసాగింపు
ప్రస్తుత కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో ప్రక్షాళనలో భాగంగా ఐదారుగురికి మాత్రమే కొనసాగింపు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ జరిగిన వైసీఎల్పీ భేటీలో మరోసారి జగన్ క్లారిటీ ఇచ్చేశారు. గతంలో ప్రకటించిన విధంగానే 90 శాతం కేబినెట్ మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నారు. ఇందులో ప్రస్తుత కేబినెట్ లో ఉన్న ఆర్ధికమంత్రి బుగ్గన, విద్యుత్మంత్రి బాలినేనిలో ఒకరిని కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పేర్నినాని, కొడాలినానిని కొనసాగిస్తారని చెప్తున్నారు. అలాగే తనకు సన్నిహితుడైన పెద్దిరెడ్డిని సైతం జగన్ కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పేర్లను ఇవాళ వైసీఎల్పీలో చెప్పకపోయినా పార్టీ వర్గాలు మాత్రం నిర్ధారిస్తున్నాయి.
Recommended Video

టార్గెట్ 2024 ప్రణాళిక ఇదే
2024లో 2019 విజయాన్ని రిపీట్ చేయడం కోసం ఏం చేయాలనే దానిపై ఇవాళ ప్రత్యేకంగా జగన్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా కొత్త మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని జగన్ స్పష్టం చేశారు. నెలకు నాలుగు సచివాలయాల సందర్శన ఉండాలని జగన్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే బూత్ కమిటీల్ని బలోపేతం చేయాలని సూచించారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్ధాయిలో పరిశీలించి లోటుపాట్లను పరిష్కరించాలని కోరారు. చివరిగా జూలైలో పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఇందులో మరింత క్లారిటీ ఇవ్వబోతున్నారు.
-
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
రాజ్యసభలో అమరావతి బిల్లుపై రూటు మార్చిన వైసీపీ, అనూహ్య డిమాండ్..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ !












Click it and Unblock the Notifications