Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుపతికి వైఎస్ జగన్: చిల్డ్రన్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన; సీఎం పర్యటన సాగుతుందిలా!!

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తిరుపతిలో భారీ ఏర్పాట్లు చేశారు వైసీపీ మంత్రులు, నేతలు. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సీఎం జగన్ తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇలా

సీఎం జగన్ తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇలా

గురువారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల 5 నిమిషాలకు తిరుపతి ఎస్వి వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. అనంతరం 11 గంటల 20 నిమిషాలకు ఎస్ వి యూనివర్సిటీ స్టేడియం చేరుకుని జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన కార్యక్రమం లో 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లులు ఖాతాలలో 709 కోట్ల రూపాయలను నేడు జమ చేయనున్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్

ఆ తర్వాత 12 గంటల 55 నిమిషాలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి భూమిపూజ లో పాల్గొంటారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలం మూడు వందల కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. టీటీడీ చిన్న పిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ లో పాల్గొన్న అనంతరం, టాటా క్యాన్సర్ కేర్ సెంటర్ కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి 3 గంటల 35 నిమిషాలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

చిన్నారుల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం ఆస్పత్రి భవన నిర్మాణంపై దృష్టి

చిన్నారుల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం ఆస్పత్రి భవన నిర్మాణంపై దృష్టి


చిన్నారుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఆసుపత్రి లేకపోవడంతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడవలసిన పరిస్థితుల నేపథ్యంలో, టిటిడి చిన్న పిల్లల ఆసుపత్రి భవన నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం పర్యటన నేపథ్యంలో తిరుపతిలో భారీ ఏర్పాట్లు చేశారు వైసీపీ మంత్రులు, నేతలు.ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తిరుపతి నుండి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించినట్టు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తిరుపతిలో అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపులు

తిరుపతిలో అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపులు

ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు చూస్తే చిత్తూరు మదనపల్లి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రామచంద్రపురం జంక్షన్ వద్ద నుంచి అన్నమయ్య సర్కిల్ సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ లోకి ప్రవేశిస్తాయి. ఇక మదనపల్లి రాయచోటి పీలేరు వైపు నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చే భారీ వాహనాలు శ్రీనివాసమంగాపురం నుంచి బైపాస్ మీదుగా రామానుజ పల్లి చెక్పోస్ట్, రామచంద్రపురం జంక్షన్, అన్నమయ్య సర్కిల్, శంకరంబాడి సర్కిల్, రామానుజం సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ లోకి అనుమతిస్తారు.ఇక తిరుపతి నుండి బెంగళూరు, చిత్తూరు, మదనపల్లె, రాయచోటి వెళ్లే బస్సులు లీలామహల్, నంది సర్కిల్, అలిపిరి గరుడ సర్కిల్, బాలాజీ కాలనీ, రామానుజ పల్లి చెక్ పోస్ట్ మీదుగా బైపాస్ వైపు మళ్లిస్తారు. ఇక ఇలా వివిధ ట్రాఫిక్ మళ్లింపు లు ఉంటాయని ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+