పులివెందులలో వైయస్ జగన్: చెప్పినవి విని, రాసుకున్నారు

Posted By:
Subscribe to Oneindia Telugu

పులివెందుల: మధ్యాహ్న భోజన పథకాన్ని పెద్ద సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఏడు నెలలుగా తమకు జీతాలు, బిల్లులు ఇవ్వకపోగా తమను తొలగిస్తున్నారని మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు వైసిపి అధినేత జగన్‌కు విన్నవించుకున్నారు.

ఆయన గురువారం కడప జిల్లా పులివెందులలో పర్యటించారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు ఆయనతో భేటీ అయ్యారు. తమ సమస్యలు విన్నవించుకున్నారు.

YS Jagan tour in Pulivendula today

దీనిపై జగన్ మాట్లాడుతూ.. మీ సమస్యలను శాసన సభలో ప్రస్తావించడంతో పాటు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా వారు చెప్పిన విషయాలను జగన్ శ్రద్ధగా విని, రాసుకున్నారు.

మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న వైసిపి నేత రామకృష్ణా రెడ్డిని జగన్ కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. రామకృష్ణారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy toured in Pulivendula on Thursday.
Please Wait while comments are loading...