షాక్: జగన్ పరామర్శిస్తే.. ఆమెకు పెన్షన్ కట్ చేశారు!
ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ కారణంగా ఓ కుటుంబం తమకు వచ్చే పెన్షన్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అనంతపురం: ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ కారణంగా ఓ కుటుంబం తమకు వచ్చే పెన్షన్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు పండ్ల సత్యనారాయణ 2015లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తనకున్న 8 ఎకరాల్లో పంటలు సాగు చేసినా.. రెండుసార్లు అరటి పంట వేసినా తీవ్ర నష్టం రావడం, రూ.2.50 లక్షలు ఖర్చు చేసినా చుక్క నీరు పడకపోవడంతో అతడు నిరాశకు గురయ్యాడు. సుమారు రూ.8 లక్షలు అప్పు భారంగా మారింది. ఈ క్రమంలో ఆయనకు ఆత్మహత్యే శరణ్యమైంది. కాగా,

అతని పెద్ద కుమారుడు సూర్యనారాయణ బెంగళూరులో ఉంటున్నాడు. రెండో కొడుకు రామాంజనేయులు ట్రాక్టర్ మెకానిక్‌గా కడపలో స్ధిరపడ్డాడు. చిన్న కొడుకు నారాయణస్వామి ఊర్లోనే రూ.2.50 లక్షలు ప్రైవేటు ఫైనాన్స్‌లో అప్పు తీసుకుని ఆటో నడుపుకుంటూ తల్లిని రామేశ్వరమ్మను చూసుకుంటున్నాడు. కాగా, ఆమె కూడా ఓ చిన్న టీ దుకాణం పెట్టుకుని జీవనం కొనసాగిస్తోంది. ప్రస్తుతానికి ఆమెకు కేవలం 3 ఎకరాల భూమి, రూ.4 లక్షలు అప్పు మిగిలింది.
కాగా, తన భర్త మరణానంతరం తనకు వచ్చే వృద్ధాప్య పెన్షన్ తీసేశారని రామేశ్వర్మ ఆవేదన వ్యక్తం చేసింది. వైయస్ జగన్.. తమను పరామర్శించాడనే కారణంగా ప్రభుత్వం కక్ష సాధించిందని, ఎన్నిసార్లు అర్జీలిచ్చినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె వాపోయింది. ఉపాధి హామీ పథకం కింద పెట్టిన మామిడి చెట్ల బిల్లులు రూ.లక్ష దాకా ఎగ్గొట్టారని రామేశ్వరమ్మ ఆరోపించారు.












Click it and Unblock the Notifications