అంబటి ఇంట్లో జగన్..! విధ్వంసంపై ఆరా..!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (ys jagan) ఇవాళ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లారు. తాజాగా చంద్రబాబుపై వ్యాఖ్యల తర్వాత టీడీపీ క్యాడర్ ధ్వంసం చేసిన ఆయన ఇంటిని పరిశీలించారు. తాడేపల్లి నుంచి ఉదయం భారీ ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నానికి గుంటూరులోని అంబటి ఇంటిని చేరుకున్న జగన్.. అక్కడ పార్టీ నేతలతో కలిసి ఘటనపై ఆరా తీశారు. అనంతరం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు.

ఉదయం 10 గంటల తర్వాత తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి జగన్ బయలుదేరారు. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానుల కార్లతో జాతీయ రహదారి అంతా నిండిపోయింది. పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని చెప్పినా జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. హైవేపై భారీ ఎత్తున సాగిన కార్ల ర్యాలీని చూసేందుకు భారీగా జనం రోడ్ల పక్కన గుమికూడారు. దీంతో జగన్ కూడా ఎక్కడికక్కడ కారు ఆపుతూ అభిమానుల్ని పలకరించుకుంటూ వెళ్లారు. దీంతో గుంటూరు చేరుకునే సరికి మధ్యాహ్నం దాటిపోయింది.

ys jagan visits Ambati Rambabu s house vandalised by tdp cadre extends support to family members

చివరికి గుంటూరు సిద్దార్ధనగర్‌లోని అంబటి రాంబాబు నివాసానికి జగన్ చేరుకున్నారు. ముందుగా అంబటి ఇంటి వాకిట్లో ఉంచిన కారును జగన్ పరిశీలించారు. టీడీపీ క్యాడర్ ఎలా ఇంట్లోకి దూసుకొచ్చు అంబటి ఇంటిని ధ్వంసం చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఇవాళే జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు అంబటి కుటుంబ సభ్యులకు తెలిపారు. అలాగే అంబటి సతీమణి, కుమార్తెలను కూడా జగన్ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అంబటితో పాటు కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+