Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాష్ట్రపతి పాలన తెచ్చేలా.. ప్రకాశం బ్యారేజ్ పై జగన్ కుట్ర చేశారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన బోట్ల వ్యవహారం కాక రేపుతుంది. టిడిపి వైసిపిల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ప్రకాశం బ్యారేజీనీ బోట్లు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని ఏపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. దీని పైన ఇప్పటికే బోట్ల యజమానులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ దిశగా కేసును లోతుగా విచారణ జరుపుతున్నారు.

జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి
మాజీ ఎంపీ నందిగం సురేష్ కు అనుచరులు కుట్రలో భాగంగానే బోట్లను కావాలని వదిలిపెట్టారని బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడంతో బ్యారేజ్ డ్యామేజ్ అయిందని మండిపడుతున్నారు. ఇక ఇదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం బ్యారేజీని కూల్చడం ద్వారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కుట్ర చేశారని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

YS jagan wanted president rule with prakasam barrage boats conspiracy AP ministers

లక్షల మందిని చంపి అలా చెయ్యాలనే కుట్ర
ప్రకాశం బ్యారేజ్ ని కూల్చడం ద్వారా లక్షల మందిని చంపి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టిన పడవల యజమానులు రామ్మోహన్, ఉషాద్రి ఇద్దరూ వైసీపీ కార్యకర్తలేనని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు. వారిని టిడిపి కార్యకర్తలుగా చిత్రీకరించడానికి ఫోటోలను మార్ఫ్ చేసి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ శ్రద్ధ వరద బాధితులకు సాయం చేయటం పైన లేదే
ఇక ఈ కేసులో నిందితులను పరామర్శించడానికి జగన్ చూపిస్తున్న శ్రద్ధ బాధితులను ఆదుకునే విషయం పైన చూపించడం లేదని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే వేలకోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదని జగన్ పైన విరుచుకుపడ్డారు.

మార్ఫింగ్ ఫోటోలతో అసత్య ప్రచారంపై మంత్రి నిమ్మల ఆగ్రహం
ఇక విలేకర్ల సమావేశాలు పెట్టి సూపర్ సిక్స్ పైన విషం చిమ్ముతున్నారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. బ్యారేజ్ మూడు కౌంటర్ వెయిట్ లు దెబ్బ తినడానికి వైసిపి వాళ్ళే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ప్రకాశం బ్యారేజీ ఘటనపైన అసత్యప్రచారాలు చేస్తున్నారని టిడిపి వర్గీయులు ఫోటో మార్ఫింగ్ చేసి ఫోటోలతో ప్రచారం చేయడం పత్రికకు, ఛానల్ కి చెల్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.

జగన్ కుట్ర అక్కడే అర్ధమైంది
బ్యారేజీని ఢీ కొట్టిన తర్వాత పోలీసుల గుర్తించే వరకు కూడా యజమానులు ముందుకు రాలేదని దీనిని బట్టి జగన్ కుట్ర స్పష్టంగా అర్థమవుతుందని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ప్రకాశం బ్యారేజ్ అని కూల్చేసి గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలను కనుమరుగు చేయాలని కుట్రతో ఈ పని చేశారని మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+