కొమ్మినేని అరెస్టు వెనుక జరిగిందిదే..! సుప్రీం ఉత్తర్వులపై జగన్..!

ఏపీ రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీలో డిబేట్ పెట్టిన వ్యవహారంలో అరెస్టు అయి రిమాండ్ పై ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఇవాళ సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆయన్ను విడుదల చేసేలా ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన ఇవాళ విడుదల కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, సాక్షి టీవీ యజమాని కూడా అయిన వైఎస్ జగన్ సుప్రీం తీర్పుపై స్పందించారు.

సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు అని వైఎస్ జగన్ తెలిపారు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పిందన్నారు. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం అన్నారు. దీంతో పాటు అసలు కొమ్మినేని అరెస్టు ఎందుకు జరిగిందో కూడా జగన్ చెప్పారు.

ys jagan welcomes supreme court s relief to kommineni Srinivasa rao in Amaravati case

అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారని జగన్ ఆరోపించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేని గారికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారన్నారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని విమర్శించారు.

మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్‌ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛ‌ను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతుందన్నారు.

ys jagan welcomes supreme court s relief to kommineni Srinivasa rao in Amaravati case

విశ్లేషకుడి వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ చంద్రబాబు కుట్రను బద్దలు చేసిందని, ఎండగట్టిందని జగన్ తెలిపారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లిందన్నారు. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావని జగన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+