అప్పుడో మాట, ఇప్పుడో మాట: బాబుపై జగన్
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తప్పు పట్టారు. ఎన్నికలకు ముందు ఓ మాట, తర్వాత మరో మాట చంద్రబాబు నాయుడికే చెల్లుతుందని ఆయన అన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శనివారంనాడు వీపునాయనిపల్లి మండలం పాలగిరిలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

వైయస్ విగ్రహానికి వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మాట ఇస్తే నిలబడాలని, ఇచ్చిన మాటను శిలాశాసనంలా చూడాలని, వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయని ఆయన అన్నారు.
విలువలకు, విశ్వసనీయతకు వైయస్ రాజశేఖర రెడ్డి మారుపేరు అని ఆయన అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం చంద్రబాబు వైయస్ రాజశేఖర రెడ్డిని చూసి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. వైయస్ వెళ్తూ వెళ్తూ ప్రజా కుటుంబాన్ని తనకు ఇచ్చి వెళ్లారని ఆయన అన్నారు. అంతకు ముందు వైయస్ జగన్ వేముల మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ కార్యకర్త జనార్దన్ రెడ్డిని పరామర్శించారు.












Click it and Unblock the Notifications