వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు లేఖ ఇస్తే జగన్ సంతకం: వాసిరెడ్డి పద్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

Vasireddy Padma
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇస్తే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతకం చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ చెప్పారు. తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమా మహేశ్వర రావు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నిలదీయాలని ఆమె మంగళవారం మీడయా ప్రతినిధుల సమావేశంలో సూచించారు.

చంద్రబాబుతో టిడిపి నాయకులు కేంద్రానికి సమైక్యం కోసం లేఖ రాయించాలని ఆమె అన్నారు. జగన్ సమైక్య సభ పెడుతుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు సమైక్య ద్రోహులని ఆమె విమర్శించారు. మంత్రుల బృందం వద్దకు వెళ్లడమంటే విభజనను అంగీకరించడమేనని వాసిరెడ్డి పద్మ అన్నారు.

కాంగ్రెసు పార్టీ అధిష్టానం కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించారని, ఆ కుట్రలో భాగంగానే మళ్లీ ఉద్యమాన్ని విరమింపజేశారని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వచ్చే ఎన్నికల్లో తగిన సన్మానం చేస్తారని ఆమె వ్యంగ్యంగా అన్నారు.

సోనియాకు సవాల్ విసరడానికే లక్ష, మందితో హైదరాబాదులో సమైక్య సభ పెడుతున్నామని ఆమె చెప్పారు. సమైక్య ఉద్యమంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం మానుకోవాలని ఆమె సూచించారు.

English summary
YSR Congress party leader Vasireddy Padma retaliated Telugudesam party comments on YS Jagan's united Andhra public meeting in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X