రాజధానిపై చంద్రబాబుకు జగన్ కీలక సూచన-కేసీఆర్ తో పోలిక..!

రాష్ట్రంలో స్కాంలన్నింటికీ పరాకాష్ట నేడు అమరావతిలో జరుగుతున్న దోపిడీ అని జగన్ ఆరోపించారు. 2018లో అమరావతిలో పిలిచిన టెండర్ల విలువ 41 వేల కోట్లని, ఇందులో 5 వేల కోట్ల పనులు చంద్రబాబు గతంలోనే పూర్తి చేశారన్నారు. మిగిలిన పనులు 35 వేల కోట్లు మాత్రమేనని, ఈ టెండర్లు రద్దు చేసి మిగిలిన పనుల అంచనాలను పెంచేసి భారీ దోపిడీ చేస్తున్నారన్నారు. దీని కోసం వైసీపీ హయాంలో అమలు చేసిన జుడిషియల్ ప్రివ్యూను, రివర్స్ టెండర్లను తీసేశారన్నారు. వీటి కోసం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని మళ్లీ తీసుకొచ్చారన్నారు.

ఐకానికి టవర్ల పేరుతో ఐదు భవనాల కోసం 2018లో టెండర్లు పిలిస్తే వచ్చిన రేటు 2271 కోట్లు అని జగన్ తెలిపారు. ఇప్పుడు మిగిలిపోయిన పనులకు నిర్మాణం వ్యయం 4668 కోట్లన్నారు. అంటే 2018తో పోలిస్తే 2418 కోట్లు పెంచేశారన్నారు. ఇది 105 శాతం అధికం అన్నారు. ఇందులో చదరపు అడుగుకు రూ.8931 అన్నారు. ఇదే ప్రభుత్వంలో ఇతర పనుల కోసం చదరపు అడుగుకు అన్ని పన్నులు కలిపినా రూ.2500 ఇవ్వడం లేదన్నారు.

ys jagan s key suggestion to Chandrababu on Amaravati capital compared with kcr s TS secretariat

ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం అంతా కలిపి ఆరు బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల్లో ఉందన్నారు. ఇది ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ ఆఫీసుల కోసం 53 లక్షల 57 వేల 389 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఈ మూడు భవనాల్లో 12 వేల మంది ఉద్యోగులు మాత్రమేనన్నారు. ఉద్యోగుల సంఖ్య పెరగనప్పుడు ఇంత విశాల భవనాలు ఎందుకన్నారు. అమరావతి శాశ్వతం కొనసాగాలని, నిరంతరం పనులు జరుగుతూ ఉండాలని, అందుకే ఇంత పెద్ద భవనాలు కడుతున్నారన్నారు.

హైదరాబాద్ లో కేసీఆర్ తెలంగాణ సచివాలయాన్ని 8.58 లక్షల చదరపు అడుగుల్లో 616 కోట్ల ఖర్చుతో కట్టారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం 53 లక్షల చదరపు అడుగుల్లో కడుతున్నారన్నారు. ఇప్పటికే కట్టిన అసెంబ్లీ, సచివాలయానికి అయిన 600కోట్ల ఖర్చును గంగపాలు చేస్తున్నారన్నారు. కొత్త భవనాలు కట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నిర్మాణాలు చేసి డబ్పులు ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించారు.

అమరావతిలో రోడ్ల నిర్మాణాన్ని చూస్తే కిలోమీటర్ కు 11 కోట్ల నుంచి 14 కోట్లు ఖర్చుపెడుతున్నారన్నారు. గతంలోనూ అమరావతి నిర్మాణాల్లో లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సందర్భాల్లో చంద్రబాబుకు గతంలో ఐటీ నోటీసులు ఇచ్చిందన్నారు.నేరుగా చంద్రబాబుకు డబ్బులు అందిన విషయం ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ వాంగ్మూలంలో ఉందన్నారు. అయినా ఏమాత్రం జంకులేకుండా మళ్లీ అవే పనులు చంద్రబాబు చేస్తున్నారన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ మభ్యపెట్టిన చంద్రబాబు .. ఆకాశాన్నంటేలా అప్పులు చేస్తున్నారన్నారు. ఇప్పటికే 52 వేల కోట్లు అప్పులు చేస్తున్నారన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ లో 6 వేల కోట్లు కేటాయించారన్నారు.

అమరావతిలో ప్రస్తుతం నడుస్తున్న పనుల కోసం 77,249 కోట్ల సాయం కావాలని చంద్రబాబు 16వ ఆర్ధిక సంఘాన్ని తాజాగా ఆడిగారన్నారు. 50 వేల కోట్ల అప్పులు కాకుండా 77 వేల కోట్లు కావాలని చంద్రబాబు అడుగుతున్నారన్నారు. ఈ లెక్కన అమరావతికి ఎన్ని లక్షల కోట్లు కావాలని ప్రశ్నించారు. ఇది పూర్తయ్యే నాటికి ఎన్ని లక్షల కోట్లు అవుతుందో అన్నారు. ఇంతింత అప్పులు తెచ్చి, ఇన్ని స్కాంలు చేసే బదులు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి విజయవాడ-గుంటూరు మధ్య నాగార్జున యూనివర్శిటీ వద్దో 500 ఎకరాలు తీసుకుని కట్టాల్సిన భవనాలు కట్టాలని సూచించారు. చంద్రబాబు చేస్తున్న పనులకు విజయవాడ, గుంటూరులో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిపోయిందన్నారు. తమ హయాంలో విజయవాడ-మచిలీపట్నం మధ్య భూముల రేట్లు పెరిగాయన్నారు. గుంటూరు-మచిలీపట్నం మధ్య రాజధాని కట్టినా అక్కడా రేట్లు పెరుగుతాయన్నారు. మీ బినామీల భూముల రేట్లు పెంచుకునేందుకే చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+