YS Jagan: బెంగళూరు నుంచి మకాం మార్చబోతున్న జగన్ ? కూటమికి కౌంటర్ ప్లాన్..!

రెండేళ్ల క్రితం ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత బెంగళూరు-తాడేపల్లి నివాసాల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan).. కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెంగళూరులో వారానికి రెండు రోజులు మాత్రమే ఉంటున్నా కూటమి పార్టీల నేతలు మాత్రం తనను తరచూ టార్గెట్ చేస్తుండటం, ఇతరత్రా కారణాలతో ఆయన మకాం మార్చబోతున్నారు.

బెంగళూరులోని యలహంక నివాసంలో వారానికి రెండు రోజులు ఉంటున్న జగన్.. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ లోటస్ పాండ్ కు వచ్చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా బెంగళూరు విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు హైదరాబాద్ లో ఉంటే కార్యకర్తలు, నేతలకు అందుబాటులో ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. తాడేపల్లి నివాసంతో పోలిస్తే హైదరాబాద్ లో ఆంక్షలు కూడా తక్కువే. దీంతో తిరిగి లోటస్ పాండ్ కు తిరిగి వచ్చేందుకు వీలుగా అక్కడ ఏర్పాట్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

YS Jagan s New Headquarters Former CM Reportedly Moving to Hyderabad to Re-Engage Rivals

హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో ఉంటూ మధ్యలో తాడేపల్లి ఇంటికి వచ్చి వెళ్లినా ఇబ్బందులు ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సైతం ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే పని చేస్తే ఆయన్ను విమర్శించేందుకు వీళ్లు సాహసించకపోవచ్చని భావిస్తున్నారు. కూటమి నేతలే కాదు వైఎస్సార్సీపీ కీలక నేతలు సైతం చాలా మంది హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వారిని రెగ్యులర్ గా కలుసుకునేందుకు కూడా జగన్ కు లోటస్ పాండ్ లో వీలు పడుతుంది. అయితే లోటస్ పాండ్ కు ఎప్పుడు షిఫ్ట్ కావాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+