Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ పాదయాత్ర అందుకే..! యనమల షాకింగ్ కామెంట్స్..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరు చెప్తే మండిపడే టీడీపీ నేతల్లో మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ముందు వరుసలో ఉంటారు. సందర్భం దొరికితే చాలు జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టే యనమల.. ఇప్పుడు తాజాగా ఆయన ప్లాన్ చేసిన పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏలూరు జిల్లా వైసీపీ నేతల భేటీలో జగన్ చేసిన పాదయాత్ర ప్రకటనపై స్పందించిన యనమల.. అందుకు గల కారణాన్ని వెల్లడించారు.

తన స్వార్ధ ప్రయోజనాల కోసమే జగన్ పాదయాత్ర చేస్తానంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. అధికారం అనే కుర్చీ కోసమే జగన్ ప్రయత్నాలు అన్నారు.జగన్ కు ఒక్కసారి కుర్చీ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు. ఐదేళ్ల జగన్ పాలన రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళు వెనక్కి నెట్టిందని,జగన్ పాలనలో అవినీతి, దోపిడీ, వ్యవస్థీకృత నేరాలు, శాంతిభద్రతల వైఫల్యంతో రాష్ట్రం నిండిపోయిందని యనమల గుర్తుచేశారు.

YS Jagan s Padayatra Motive Revealed by TDP s Yanamala ramakrishnudu

జగన్ పాలనలో ప్రజలు ఇప్పటికే నానా కష్టాలు పడ్డారని, జగన్ అంటే అరాచకం, ధరల పెరుగుదల, సున్నా అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం వంటివే గుర్తొస్తాయని యనమల తెలిపారు. నియంతృత్వ, ఫ్యాక్షనిస్ట్ స్వభావం కలిగిన వ్యక్తి జగన్ అన్నారు. జగన్ ప్రవర్తన హిట్లర్, తుగ్లక్, ముస్సోలినీ తరహాలో ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ప్రజలు ఎప్పటికీ నమ్మరని యనమల రామకృష్ణుడు తేల్చిచెప్పేశారు. జగన్ పాదయాత్ర ప్లాన్ పై టీడీపీ నుంచి వచ్చిన తొలి స్పందన ఇదే కావడం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+