జగన్‌ చేసిన మంచిని గుర్తు చేసుకుంటున్న ప్రజలు..ఓడినా రాజు రాజే..!

జగన్ అధికారంలో లేకపోయిన ఆయన చేసిన మంచి పనులను రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ గురించి ఇప్పుడు విజయవాడలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది.

కర్ణాటక నుంచి నీటిని దిగువకు వదులుతుండటంతో కృష్ణానది తీరాన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు వరదలు వచ్చినా... కృష్ణలంక ఏరియా మునిగిపోతుండేది. ముఖ్యంగా కృష్ణలంక, సీతమ్మదార, రాణిగారితోట వంటి ప్రాంతాలు నీటమయం అయ్యేవి. లక్షల క్యూసెక్కుల వరద వచ్చి పేదల ఇళ్లను ముంచేస్తుండేది. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడ నుంచి తరలించి పునరావాస కేంద్రాలకు తరలించేవారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు తమ ఇళ్లకు చేరుకునేవారు. అయితే గత జగన్ ప్రభుత్వం తీసుకున్న చొరవతో కృష్ణలంక ప్రజలకు శాశ్వత పరిష్కరం దక్కినట్టు అయింది.

YS Jagan s Retaining Wall Saves Vijayawada from Floods Residents Hail Former CM s Foresight

కృష్ణలంక ప్రజలను వరదలను నుంచి కాపాడటానికి కనకదుర్గ వారధి నుంచి కోటినగర్‌ వరకు 2.6 కిలోమీటర్ల పొడవునా రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించింది అప్పటి జగన్ సర్కార్. 125 కోట్ల వ్యయంతో మూడు అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతులో ర్యాఫ్ట్‌ పద్ధతితో, 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్‌ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించడం జరిగింది. ఇప్పుడు జగన్ నిర్మించిన ఆ రిటైనింగ్‌ వాల్‌ కృష్ణలంక ప్రాంత ప్రజలకు రక్షణగా నిలిచింది.

భారీగా కురుస్తోన్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వర ఉధృతి పెరిగినప్పటికి రిటైనింగ్‌ వాల్‌ కారణంగా కృష్ణలంక ప్రాంత సురక్షింతంగా ఉన్నారు. దీంతో తీర ప్రాంత ప్రజలు జగన్‌ను చేసిన మంచి పనిని గుర్తు చేస్తున్నారు. జగన్ ముందు చూపు చొరవతో నిర్మించిన ఈ రిటైనింగ్‌ వాల్‌ వల్లే కృష్ణలంక ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+