ఏఐసీసీ నుంచి షర్మిలకు పిలుపు - ఏపీలో బాధ్యతల్లో నిర్ణయం మార్పు..!!

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక లాంఛనమే. కొద్ది నెలలుగా షర్మిల కాంగ్రెస్ లో చేరటం పైన ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఎన్నికల సమయంలోనే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటంతో పాటుగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ, తెలంగాణ నేతలు అడ్డుకున్నారు. ఇప్పుడు షర్మిలను కాంగ్రెస్ లో చేరటం..ఏపీ బాధ్యతల పైన చర్చ సాగుతోంది. ఇక్కడా కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ లో చేరటం ఖాయమైనా..బాధ్యతల విషయంలో మాత్రం కొత్త చర్చ మొదలైంది.

రేపు అధికారికంగా కాంగ్రెస్‌లో షర్మిల చేరే అవకాశం ఉంది. షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. షర్మిలకు ఏపీ బాధ్యతలు ఇస్తారనే చర్చ సాగుతున్న వేళ..కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఏపీ బాధ్యతల పైన షర్మిల సిద్దంగా లేరని తెలుస్తోంది. కాంగ్రెస్ లో పని చేస్తానని...ఏపీ బాధ్యతల అంశం తరువాత పరిశీలన చేద్దామని షర్మిల ప్రతిపాదించినట్ల తెలుస్తోంది. ముందుగా జాతీయ స్థాయిలో ఏఐసీసీలోనే సర్ధుబాటు చేయాలని షర్మిల విజ్ణప్తి చేసినట్లు సమాచారం. దీంతో, ఇటు ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన పార్టీ హైకమాండ్ ఏపీలో ఏడాది కాలంగా నిర్వహించిన కార్యక్రమాల పైన ఆరా తీసింది. భవిష్యత్ కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేసింది.

YS Sharmila chances to join in congress in presence of Rahl Gandhi in Delhi on 28th December

షర్మిలకు మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల వేళ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా నియామకం జరగనుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావటంతో రేపు ( డిసెంబర్ 28) న షర్మిల అధికారంగా చేరుతారని తెలుస్తోంది. తన పార్టీ వీలినం పైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఏపీలో వచ్చే నెలలో అమరావతికి మద్దతుగా బహిరంగ సభకు నిర్ణయించారు. అదే విధంగా విశాఖలోనూ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మరో సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అమరావతి సభకు ప్రియాంక గాంధీ, విశాఖ సభకు రాహుల్ రానున్నారు. ఈ రెండు సభల్లోనూ షర్మిల పాల్గొంటారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+