డజను డిమాండ్లు పెట్టిన వైఎస్ షర్మిల- ఒక్కటి నెరవేరినా మైలేజ్
YS Sharmila: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీరును ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎండగట్టారు. ఘాటు విమర్శలు సంధించారు.
అధికారంలో వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం చేస్తామంటూ హామీలు ఇచ్చి.. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదే మరి.. అంటూ మండిపడ్డారు.

తమ గోడు వినిపించాలనుకుంటోన్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని షర్మిల ఆరోపించారు. వారి గొంతు నొక్కి, ఆందోళలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్టగా అభివర్ణించారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని గుర్తు చేశారు.
ఆంగన్వాడి కార్యకర్తలందరినీ వెంటనే చర్చించాలకు పిలవాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు నెలకు గౌరవ వేతనం 26,000 ఇవ్వాలని, తక్షణం గ్రాట్యూటి చెల్లింపు హామీని అమలు చేయాలంటూ గళమెత్తారామె. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలని అన్నారు.
హెల్పర్ల పదోన్నతిపై నిర్దుష్టమైన మార్గదర్శకాలను ఇవ్వాలని, పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకోవాలని, ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై ఓ విస్పష్ట ప్రకటన చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికలు ముగిసిన తరువాత ఒకలా వ్యవహిరిస్తూ ఆంగన్వాడీలను చంద్రబాబు-పవన్ కల్యాణ్ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందంటూ విమర్శించారు.












Click it and Unblock the Notifications