చెప్పిందే జరుగుతుంది.. సత్యం గెలుస్తుంది: వైఎస్ షర్మిల ఆసక్తికర పోస్ట్!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలతో తల పడుతూనే తెలంగాణ రాష్ట్రం విషయంలోనూ ఆసక్తికరమైన పోస్టులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని పెట్టి సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై హోరాహోరీగా యుద్ధం చేసిన వైఎస్ షర్మిల అప్పట్లో కెసిఆర్ కుటుంబం చేసిన అవినీతిని తూర్పారబట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ అవినీతికి పాల్పడ్డారని కాగ్ అధికారులకు అవినీతికి సంబంధించిన ఆధారాలను అందించిన వైయస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కెసిఆర్ ను, ప్రాజెక్టును దక్కించుకున్న మేఘా సంస్థను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై అప్పుడే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు.

 YS Sharmila interesting post that truth prevails in CAG report over kaleshwaram project

ఇక తాజాగా రాష్ట్ర ఆర్థిక రంగానికి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పెనుభారంగా మారనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక పేర్కొంది. 2022 మార్చికి కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థకు మొత్తం రూ.96,064 కోట్ల రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని తెలిపింది. ఇందులో 2022 మార్చి నాటికి రూ.87,449.15 కోట్లు తీసుకుందని పేర్కొంది.

2035-36 నాటికి వడ్డీ సహా అక్షరాలా రూ.1,41,544.59 కోట్లు తిరిగి చెల్లించాలని వివరించింది. రుణ ఒప్పందాల ప్రకారం తొలుత పేర్కొన్న వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తేనే తిరిగి చెల్లించాల్సిన సొమ్ము ఇంత ఉంటుందని, వడ్డీ రేట్లు పెరిగితే చెల్లించాల్సిన నగదు కూడా పెరుగుతుందని వెల్లడించింది.

ఇక కాగ్ నివేదిక ఆధారంగా మరోమారు సోషల్ మీడియా ద్వారా షర్మిల ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఎప్పటికైనా సత్యం గెలుస్తుందని గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గట్టిగా పోరాడి నేడు నిరూపిస్తున్నామని, ప్రజాధనాన్ని గుంజుకున్న ఏ ప్రజా ప్రతినిధి తప్పించుకోలేడు అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

అంతే కాదు గతంలో తాను అక్టోబర్ 21 2022న అధికారి శ్రీ జి.సి ముర్ముకు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలను సమర్పించానని, కాగ్ నివేదిక కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని అంగీకరిస్తుందని వైయస్ షర్మిల పోస్ట్ చేశారు. తాను గతంలో చెప్పిందే నిజమైంది అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+