ఆ వైసీపీ సీనియర్ మంత్రి ఫ్యామిలీకి 2 సీట్లు రిజర్వ్ చేసిన షర్మిల ?

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు ఇప్పుడు ఆ పార్టీతో పాటు ఇతర పార్టీల్లోనూ పలు సమీకరణాలన్ని మార్చేస్తోంది. దీంతో ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారేందుకు సిద్ధమైపోతున్నారు. తమకు టికెట్ ఇవ్వని వైసీపీని కాదని, ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోయేందుకు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు సిద్ధమైపోతున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ సీనియర్ మంత్రి కుటుంబానికి కాంగ్రెస్ లో రెండు టికెట్లు రిజర్వ్ అయినట్లు తెలుస్తోంది

రాష్ట్రంలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా ఉన్న కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు ఈసారి నియోజకవర్గం మారాల్సి వచ్చింది. ఆయనను ఈసారి ఆలూరు అసెంబ్లీ సీటు నుంచి కాకుండా కర్నూలు ఎంపీ సీటులో పోటీ చేయాలని అధిష్టానం సూచించింది. దీనికి తొలుత సరేనన్నట్లు కనిపించిన జయరాం ఆ తర్వాత టోన్ మార్చారు. సీఎం జగన్ తో ఫైనల్ గా చర్చించినా ఫలితం లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ys sharmila reserved mp and mla seats for this ysrcp minister in congress?

అలూరు అసెంబ్లీ స్ధానంలో తిరిగి పోటీకి జయరాంకు టికెట్ లేదని ముందే సంకేతాలు వచ్చేశాయి. దీంతో ఆయన తనకు సన్నిహితుడైన కర్నాటక కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర ద్వారా లాబీయింగ్ మొదలుపెట్టారు. చివరికి కర్నూలు ఎంపీ సీటులో అయితే ఓకే అని జగన్ చెప్పేశారు. కానీ జయరాంకు కర్నూలు ఎంపీ సీటులో పోటీ చేసినా ఫలితం ఎలా ఉంటుందో తెలియని పరిస్ధితి. దీంతో చివరకు ఆయన మంత్రి నాగేంద్ర సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు షర్మిల వర్గంతో చర్చలు జరపడంతో జయరాంతో పాటు ఆయన కుమారుడికి కూడా సీట్లు కేటాయించేందుకు సిద్ధమన్నారు.

కాంగ్రెస్ లో చేరితే కర్నూలు లోక్ సభ సీటుతో గుమ్మనూరు జయరాంతో పాటు అలూరు సీటులో ఆయన తనయుడు ఈశ్వర్ కు ఆలూరు సీటులో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో షర్మిల జిల్లాల టూర్ లోనే ఆమెను కలిసి భవిష్యత్తు కార్యాచరణపై జయరాం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఆఫర్ ఇవ్వాలని వైసీపీని కోరినా జగన్ ససేమిరా అనడంతో కాంగ్రెస్ లో చేరి తన పంతం నెగ్గించుకునేందుకు జయరాం సిద్ధమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+