మరి వాటి సంగతేంటి ? సాయిరెడ్డి ట్వీట్ కు వైఎస్ షర్మిల కౌంటర్ !

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలు తమకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకునే పరిస్ధితి కనిపించడం లేదు. తాజాగా సీఎం జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తమ ముందుకు వచ్చిన పలు ప్రాజెక్టుల ప్రతిపాదల్ని ఆమోదించింది. వీటిని గర్వంగా పేర్కొంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీనికి పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఘాటు కౌంటర్ ఇచ్చారు.

ఇంతకీ విజయసాయిరెడ్డి ఏమని ట్వీట్ చేశారంటే.. సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు.. 5300 ఉద్యోగాల కల్పనతో ఉజ్వల భవిష్యత్తును వాగ్దానం చేస్తూ ఇంధన పరిశ్రమలు స్దాపించేందుకు రూ.22302 కోట్ల ప్రతిపాదనల్ని ఆమోదించిందని పేర్కొన్నారు. ప్రతిపక్షం తన నెగెటివ్ ప్రచారాన్ని కొనసాగించుకోవచ్చని, తాము తమ మంచి పనుల్ని కొనసాగిస్తామని సాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.

ys sharmila targets vijayasai reddy with investments from vizag, davos summits

దీనికి కౌంటర్ గా వైఎస్ షర్మిల ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఆమె అయితే, వీటిలో ఎన్ని వైజాగ్ సమ్మిట్ నుండి వచ్చాయి? సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రోగ్రెస్ కార్డ్‌తో రాగలదా? అలాగే మీ హయాంలో పారిపోయిన పెట్టుబడుల గురించి అందరికీ చెప్పండి? అని సవాల్ విసిరారు. వాస్తవానికి, దావోస్‌లో ఇంతకుముందు సంతకం చేసిన 1.25 లక్షల కోట్ల పెట్టుబడుల తాజా పరిస్ధితి చెప్తారని ఎదురుచూస్తున్నానని, అసలు ఈ ఏడాది సదస్సుకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలని ప్రశ్నించారు.

దీంతో ఇప్పటివరకూ వైసీపీకి వ్యతిరేకంగా బహిరంగంగా సాగిన వైఎస్ షర్మిల విమర్శల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాకూ విస్తరించినట్లు కనిపిస్తోంది. అదీ ట్విట్టర్ స్టార్ అయిన విజయసాయిరెడ్డికి షర్మిల కౌంటర్లు వేయడం మొదలుపెట్టడం చూస్తుంటే ఎన్నికల నాటికి ఈ వార్ మరింత ముదిరేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+