జగన్ ది అక్రమ సంబంధం-చంద్రబాబు, పవన్ ది.. షర్మిల షాకింగ్..!
ఏపీలో కూటమి పార్టీలకు పరోక్షంగా మద్దతిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీసీసీ ఛీఫ్ షర్మిల ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయకుండా అయితే బీజేపీపై లేకపోతే జగన్ పై తన విమర్శలు ఎక్కుపెడుతున్న షర్మిల.. ఇవాళ విశాఖలో మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇదే క్రమంలో కూటమికీ, జగన్ కూ ఉన్న తేడా ఏంటో షర్మిల చెప్పేశారు.
కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో ఎన్డీయే కూటమిది సక్రమ సంబంధమని, కానీ జగన్ ది మాత్రం అక్రమ సంబంధమని పీసీసీ ఛీఫ్ షర్మిల తేల్చిచెప్పేశారు. అంతే కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయి ఉండి జగన్ బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మోడీ తన తాజా టూర్ లో ఏమీ మాట్లాడకపోయినా రాష్ట్రంలో కూటమితో పాటు జగన్ కూడా మౌనంగా ఉండిపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. దీనికి నిరసనగా ఇవాళ సాయంత్రం విశాఖలో మౌనదీక్షకు ప్లాన్ చేశారు.

విశాఖలో ఇవాళ పర్యటిస్తున్న షర్మిల.. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పోస్టర్ ఆవిష్కరించారు. అంబేద్కర్ జపం కాంగ్రెస్ చేస్తే తప్పేంటి అని ఆమె ప్రశ్నించారు. అంబేద్కర్ కోసం మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. అంబేద్కర్‌ను బీజేపీ అవమానపరిచిందని, దానికి నిరసనగా సాయంత్రం మౌనదీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు.
ఏపీని ప్రధాని మోదీ మోసం చేశారని షర్మిల ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్‌లు ఉండవని వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని విమర్శించారు. పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానించిన హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే ప్రధాని మోడీయే ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, షర్మిలా రెడ్డి మాత్రమే రాష్ట్రంలో పోరాటం చేస్తుందని ఆమె గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications