ఆమరణదీక్షకు సిద్దమైన వైఎస్ షర్మిల-చంద్రబాబుకు అల్టిమేటం..!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహారదీక్షకు సిద్దమయ్యారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) బిల్లుల్ని చెల్లించడంలో విఫలం కావడంతో ప్రైవేటు ఆస్పత్రులు సేవల్ని నిలిపేశాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద వైఎస్ షర్మిల నిరసన తెలిపారు. వర్షంలో తడుస్తూ స్టేచర్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఆరోగ్య శ్రీని అనారోగ్యశ్రీ గా మార్చారని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. ఆరోగ్య శ్రీ పథకం పెట్టి వైఎస్సార్ దేవుడైతే... పథకాన్ని ఆపి చంద్రబాబు రాక్షసుడు అయ్యాడంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య శ్రీ పేరు ఏదైనా సరే పథకాన్ని కొనసాగించాలని కోరారు. నారావారి ఆరోగ్య సేవా అని పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. వెంటనే 2700 కోట్లు ఆస్పత్రులకు విడుదల చేయాలన్నారు. గతంలో వైసీపీ 2 వేల కోట్లు బకాయిలు పెట్టింది సరే మీ బుద్ధి ఎటుపోయిందని కూటమి సర్కార్ ను ప్రశ్నించారు.

ఆరోగ్య శ్రీ పథకాన్ని బంద్ పెట్టే కుట్ర జరుగుతుందని షర్మిల ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని కోమాలో నెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించారు. వైఎస్ కి గొప్ప పేరు తెచ్చి పెట్టిన పథకం ఆరోగ్య శ్రీ అని, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని పథకాన్ని రూపకల్పన చేశారన్నారు. కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్య శ్రీ కొనసాగించే పరిస్థితి లేదని, బిల్లులు చెల్లించలేదు అని గత 14 రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపి వేశారని షర్మిల తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలు నిలిపి వేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల కోరారు. ఆరోగ్య శ్రీ అందకుండా పడుతున్న బాధలకు సమాధానం ఎవరు చెప్తారని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ తీసివేస్తే మళ్ళీ ఆస్తులు అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలా అని ప్రశ్నించారు. లేకుంటే వైద్యం అందలేదు అని చనిపోవాలా అని అడిగారు. ఆరోగ్య భద్రత ఇవ్వని మీరు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కూటమి పాలన 16 నెలల్లో 5900 కోట్ల మేర బిల్లులు పెట్టారని,ఇందులో 5200 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. ఇంకా 700 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు ఆరోగ్య శ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించక పోతే తాను ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications