ఈ రోజే పండుగ: జగన్‌కు బెయిల్‌పై విజయమ్మ

హైదరాబాద్: తన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన ఈ రోజే తమకు పండుగ రోజని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. జగన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత ఆమె సోమవారం సాయంత్రం జగన్ నివాసం లోటస్ పాండులో ఆమె మీడియాతో మాట్లాడారు.

తమకు అండగా నిలిచిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆశీర్వాదాలు జగన్‌కు కావాలని ఆమె అన్నారు. దేవుని దయవల్ల వైయస్ జగన్‌కు బెయిల్ మంజురైందని ఆమె అన్నారు. జగన్ లేని సమయంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కుని పార్టీని నిలబెట్టిన కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారందరి ప్రార్థనల వల్ల వైయస్ జగన్ బయటకు వస్తున్నారని ఆమె అన్నారు.

YS Vijayamma

జగన్‌కు బెయిల్ రావడంతో ఆయన సొంత జిల్లా కడపలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా వైయస్ అభిమానులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

సరైన సమయంలో జగన్ బయటకు వస్తున్నారని, రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉన్న స్థితిలో జగన్ బయటకు వస్తున్నారని, సమైక్యాంధ్ర కోసం జగన్ పోరాటం చేస్తారని ఆశిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. బెయిల్ డీల్ అనే మాట్లాడేవారికి మానవత్వం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు.

రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేక జగన్‌కు బెయిల్ రావడంపై విమర్సలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ వెంటే జనం ఉన్నారని మాజీ మంత్రి మారెప్ప అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతిస్తుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+