వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో విజయమ్మ చక్రం: గొడుగు కింద బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షులు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకుల బృందం ఢిల్లీలో జాతీయ నాయకులను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరింది. సిపిఎం, డిఎంకె తదితర ఇతర సమైక్యవాద పార్టీల నేతలను వారు కలిశారు. మరోవైపు బుధవారం పార్టీ సమావేశమై జగన్ చేత దీక్ష భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

గత నెలలో జగన్ ఆరు రోజుల దీక్ష చేశారు. ఒక నెల రోజుల వ్యవధిలో దీక్ష చేయడం వల్ల శారీరకంగా మంచిది కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం, పార్టీ విశాల ప్రయోజనాల దృష్ట్యా దీక్ష విషయమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జగన్‌కు హైదరాబాద్‌ను వదిలి వెళ్లేందుకు కోర్టు ఆంక్షలు ఉండటంతో జిల్లాల్లో పర్యటించలేరు. అందుకే పార్టీ తరఫున విజయమ్మ లేదా షర్మిలను జిల్లాల్లో పర్యటించి సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు ఒక యాత్రను ఖరారు చేసే అవకాశం ఉంది.

ఈ నెల 19న హైదరాబాద్‌లో సమైక్యశంఖారావం సభను తలపెట్టారు. ఈ సభకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే పార్టీ నేతలు నగర పోలీసు కమిషనర్‌ను కలిసి అభ్యర్ధించారు. ఒక వేళ పోలీసు శాఖ అనుమతి నిరాకరిస్తే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాలని యోచిస్తున్నారు. ఇంకోవైపు బుధవారం లేదా గురువారం రాత్రి పోలీసులు జగన్ దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నాయంటున్నారు.

సీతారాం ఏచూరీ

సీతారాం ఏచూరీ

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కలిసి రావాలని సిపిఎం నాయకులు సీతారాం ఏచూరి తదితరులను కలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ.

విలేకరులతో

విలేకరులతో

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కలిసి రావాలని సిపిఎం నాయకులు సీతారాం ఏచూరి తదితరులను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ.

కనిమొళి

కనిమొళి

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కలిసి రావాలని డిఎంకే నాయకురాలు కనిమొళిని కలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఇతర నేతలు.

చంద్రబాబు 1

చంద్రబాబు 1

తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో ఇతర నేతలు.

చంద్రబాబు 2

చంద్రబాబు 2

తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పడుకున్న దృశ్యం.

చంద్రబాబు 3

చంద్రబాబు 3

తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో ఇతర నేతలు.

చంద్రబాబు4

చంద్రబాబు4

తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలుపుతున్న జాతీయ నేతలు.

చంద్రబాబు 5

చంద్రబాబు 5

తెలుగు ప్రజలకు సమన్యాయం చేయాలంటూ ఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు 6

చంద్రబాబు 6

తెలుగు ప్రజలకు సమన్యాయం చేయాలంటూ ఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు 7

చంద్రబాబు 7

న్యూఢిల్లీలోని ఎపి భవన్లో తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ దీక్ష చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు వద్ద ఆయన తనయుడు నారా లోకేష్.

సంతోష్ రెడ్డి

సంతోష్ రెడ్డి

మాజీ మంత్రి, తెలంగాణ ప్రాంత సీనియర్ రాజకీయ నాయకులు సంతోష్ రెడ్డి బుధవారం కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

English summary
YSR Congress Party honorary president YS Vijayamma met CPM leaders on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X