Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

YS Vijayamma: జగన్ కు విజయమ్మ భారీ షాక్-ఆస్తులు పంచనేలేదు-నేనే సాక్షినంటూ బహిరంగలేఖ..!

ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఆస్తుల యుద్దంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ ఇవాళ స్పందించారు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన అంటూ ఆమె లేఖ ప్రారంభించారు. తాజా సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాదేస్తుందన్నారు.

పెద్దలంటారు.. ఇంటి గుట్టు వ్యాధి రట్టు.. తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అనేవారని, అయితే ఇలా కాదని, చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, తాను, పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళమని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదని, తాను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని తన కళ్ళముందే జరిగి పోతున్నాయని విజయమ్మ తెలిపారు.

YS vijayamma s first reaction to ys jagan ys Sharmila assets war reveal key issues on ysr will

తమ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారని, అబద్దాల పరంపర కొనసాగుతుందని విజయమ్మ తెలిపారు. తెలిసి కొంత తెలియకుండా కొంత మాట్లాడుతున్నారని, ఎంతగానో అవి దావాలనంగా ఎక్కడెక్కడికో పోతున్నాయని తెలిపారు. ఇవి కంటిన్యూ అవ్వకూడదని, తన పిల్లలిద్ధరికీ కాదు, చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదన్నారు. తాు ఈ విషయంగా రాకూడదని అనుకున్నానని, అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

తమ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నానని, ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు. మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర్ రెడ్డి గారికి మేము ఎంతో.. మీరు కూడా అంతే అని విజయమ్మ తెలిపారు. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో, మిమ్మల్ని అంతగానే ప్రేమించారన్నారు. మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారన్నారు.

అంతెందుకు.. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్యనుంచి వెళ్ళిపోయాక నా పిల్లలను, ఆయన ఉన్నప్పటి కంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్నారని విజయమ్మ తెలిపారు. అది తాను ఎన్నటికీ మరిచి పోలేనన్నారు. అందుకు తన జన్మంతా మీకు రుణపడి ఉంటానన్నారు. దయచేసి కుటుంబం గురించి, తన పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా లో కల్పిత కథలు రాయవద్దన్నారు. దూషణలు చేయవద్దన్నారు.

ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దని విజయమ్మ కోరారు. Blood is thicker than water. వాళ్ళు ఇద్దరు సమాధాన పడతారని, మీరెవరు రెచ్చ గొట్టవద్ధని మనవి చేశారు. తాను నమ్మిన దేవుడు యేసయ్య అని, సమాధాన కర్త అని, తన బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని తన నమ్మకం అని విజయమ్మ తెలిపారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి ఇతరులు మాట్లాడుతున్నది వాళ్ళు ప్రేమించే వైఎస్సార్ గురించి అని మరిచి.. తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని స్పృహ లేకుండా ఎన్నో అసత్యాలు చెప్పారన్నారు.

వైఎస్సార్ బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశారని అన్నారని, ఇది అవాస్తవం అన్నారు. వైఎస్సార్ పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుండి, కొన్ని ఆస్తులు పాప పేరు మీద.. అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదన్నారు. వైఎస్ బ్రతికి ఉండగనే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్ట్ చదివారని, అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ చదివి ఉండాల్సిందన్నారు. వైఎస్సార్ చేసింది పంపకం కాదని, కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే అన్నారు.

విజయసాయి రెడ్డి ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని తెలుసన్నారు. వైవి సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారని, అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం చాలా బాధ కలిగించిందన్నారు. అబద్దాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెప్తున్నట్లు తెలిపారు..వీరు ఇద్దరు తన పిల్లలని, వీరిని తాను , వైఎస్ఆర్ ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నామన్నారు. అమ్మగా తనకు ఇద్దరు సమానమే అన్నారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి మాట సమానమే అన్నారు.

ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజమన్నారు. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ నిజం అన్నారు. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజమని, కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం అన్నారు. జగన్ బాధ్యత గల కొడుకు గా కుటుంబ ఆస్తులను సంరక్షించాలన్నది కూడా నిజమన్నారు. వైఎస్సార్ చివరి రోజుల్లో, జగన్ ఆయనకు ఇచ్చిన మాట " నాన్న నీ తర్వాత ఈ లోకంలో, పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని " అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది "నాలో నాతో YSR అనే పుస్తకం"లో ఎప్పుడో రాశానన్నారు.

రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. అందరం కలిసి ఉన్నాం. అన్ని కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకొనే సరికి, ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్ గా సాయి రెడ్డి కి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారన్నారు. రాజశేఖర్ రెడ్డి మన మధ్య నుంచి వెళ్ళిపోయాక.. 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు కలిసి ఉన్నారని, డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని, 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారని తెలిపారు. MOU ప్రకారం జగన్ 60 శాతం.. పాపకు 40 శాతం అయితే, MOU కు ముందు...సగం సగం డివిడెండ్ తీసుకొనే వారన్నారు. ఎందుకంటే షర్మిలకు సమాన వాటా ఉంది కాబట్టి అన్నారు. వీటికి అన్నింటికీ అప్పుడు, ఇప్పుడు, తానే సాక్షిని అన్నారు

2019 లో సిఎం అయిన రెండు నెలలకు, డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్ లో జగన్ ప్రపోజల్. జగన్ చెప్పింది ఏంటంటే... "పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు..నాకు అల్లుళ్ళు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు..కాబట్టి విడిపోదాం" అన్నాడు. అలా 2019 వరుకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది.

ఆ తర్వాత విజయవాడలో, నా సమక్షంలో , ఆస్తుల్లో ఇవి జగన్ కి, ఇవి పాప కి అని అనుకున్నారు. 2019 లో అప్పుడు రాసిన MOU నే ఈ MOU. ఇది జగన్ నోటితో చెప్పి.. ఆయన చేతితో రాసిన MOU నే ఇది. హక్కు ఉంది కాబట్టే పాప కి 200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు. పాపకి హక్కు ఉంది కాబట్టే MOU రాసుకున్నారు. అఫిషియల్ గా రాసుకున్నారు. MOU లో పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదు. జగన్ భాధ్యత గా ఇస్తున్నవి అన్నారు.

అటాచ్ మెంట్ లో లేవు కాబట్టి, MOU లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, MOU లో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం, పాపకు వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండ.. ఆటాచ్ మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, YSR గారి ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019 వరకు కలిసి ఉన్నాము. షర్మిలమ్మ ను బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయలేదు. అయినా షర్మిలమ్మ పాలిటిక్స్ లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. జగన్ అధికారంలో రావడానికి పాప కృషి ఎంతో ఉంది.

జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే, చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా, అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం. ఇంత మంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్దాల మధ్య నిజం తెలియాలనే.. ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే... అయినప్పటికీ, వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు.

రాజశేఖర్ రెడ్డి గారు ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు. ఇంతటి వివాదం జరిగేది కాదు. ఆస్తుల విషయంపై నేనూ ఇలా రావాల్సిన అవసరం పడేది కాదు. అయినా దీని విషయంగా జరుగుతున్న రచ్చను చూసి.. నా మాటలు మాత్రమే ఆపుతాయనీ విశ్వసిస్తూ.. నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని.. మీ ముందుకు రావాల్సి వచ్చింది.మరొక్కసారి మీ అడబిడ్డగా ప్రతి ఒక్కరినీ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని కోరుకుంటున్నట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+