వివేకా హత్య కేసులో ముగిసిన గడువు, సీబీఐ కీలక నిర్ణయం- వాట్ నెక్స్ట్..!!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన వైఎస్ వివేకా హత్య కేసు విచారణ గడువు ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజుతో విచారణ ముగియాల్సి ఉంది. కానీ, సీబీఐ దోషులు ఎవరో ఇప్పటికీ తేల్చలేదు. సుదీర్ఘ కాలం విచారణ చేసిన సీబీఐ పలువురిని అరెస్ట్ చేసింది. అనేక మందిని విచారణ చేపట్టింది. ఎంపీ అవినాశ్ రెడ్డి వర్సస్ సీబీఐ న్యాయ పోరాటం ఈ కేసులో అనేక మలుపులు తిరిగింది. ఇప్పుడు విచారణ సమయం ముగింపు వేళ సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
వివేకా కేసులో ముగిసిన సమయం : వివేకా హత్య కేసు ఏపీలో రాజకీయంగా అనేక వివాదాలకు కారణమైంది. తన తండ్రి హత్య కేసును తేల్చాలని వివేకా కుమార్తె న్యాయపోరాటం చేసారు. ఎంపీ అవినాశ్ రెడ్డి లక్ష్యంగా అనేక ఆరోపణలు చేసారు. ఈ కేసులో అనేక అంశాల పైన సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ కేసు సుదీర్ఘ విచారణ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది.

ఈ రోజు (జూన్ 30) తో కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ, ఇటు సీబీఐ విచారణ ఇంకా పూర్తి కాలేదు. అటు అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయటంతో బెయిల్ నిబంధనల్లో భాగంగా ప్రతీ శనివారం అవినాశ్ సీబీఐ ముందు హాజరవుతున్నారు.
సుప్రీంకు సీబీఐ అభ్యర్ధన : అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. అవినాశ్ తండ్రి భాస్కర రెడ్డి ఈ కేసులో జైల్లో ఉన్నారు. అవినాశ్ కు బెయిల్ ఇవ్వటం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అత్యవసర విచారణ చేయాలని కోరారు.
అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీం ప్రశ్నించింది. ఈ పిటీషన్ ను జూలై 3న విచారణకు నిర్ణయించింది. సీబీఐ విచారణకు గడువు ముగుస్తున్న అంశం ఇప్పుడు కీలకంగా మారుతోంది. విచారణ గడువు ముగింపు అంశం ఆ రోజున సుప్రీం విచారణలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ గడువు అంశం పైన నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

జూలై 3న విచారణ : ఇదే సమయంలో సీబీఐ విచారణ గడువు పొడిగింపు కోరుతూ సుప్రీంకోర్టును అభ్యర్ధించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 2019 మార్చిలో వివేకా హత్య జరిగింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో అనేక మలుపులు చోటు చేసుకేున్నాయి. అవినాశ్ కేంద్రంగా గత కొద్ది నెలలుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ కేసులో హైకోర్టు విచారణ సమయంలో తమకు ఈ ఘటనతో సంబంధం లేదని..ఇదంతా రాజకీయ కుట్రగా అవినాశం వాదించారు. సీబీఐ మాత్రం అవినాశ్ పైన అనేక అభియోగాలు నమోదు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణ ముగించటం..సీబీఐ తాజా అభ్యర్ధనతో..సుప్రీం తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications