ఎన్నికలవేళ షాకిస్తున్న వైఎస్ వివేకా కుమార్తె సునీత: అవినాష్ రెడ్డి, జగన్‌పై తీవ్రఆరోపణలు!!
ఏపీలో ఎన్నికలు సమీపించిన వేళ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నేతలకు జగన్ సొంత కుటుంబం నుంచే నిరసన సెగ తగులుతుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయనను సపోర్ట్ చేస్తున్న వైయస్ జగన్ లక్ష్యంగా, కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైయస్సార్ షర్మిల, ఆమెకు మద్దతుగా వివేక కుమార్తె సునీత తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
వాళ్ళు తనను నరికి చంపినా ఆశ్చర్యం లేదు: వైఎస్ సునీత
తాజాగా వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాట్లాడుతూ మరోమారు అవినాష్ రెడ్డి పైన, వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు హంతకులు దర్జాగా బయట తిరుగుతున్నారని, వారు తనను కూడా నరికి చంపినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని వివేక కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేశారు.

తన ఫ్యామిలీలోని వారే చంపారంటే నమ్మలేదు.. కానీ
అవినాష్ రెడ్డి పైన, సీఎం జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె తన తండ్రిని తన కుటుంబంలోని వారే హత్య చేశారంటే మొదట తాను నమ్మలేకపోయానన్నారు. వాళ్ళను నమ్మటమే తాను చేసిన తప్పన్నారు. అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెబుతుందని, అతనిని అరెస్టు చేయకుండా సిబిఐ ని కూడా రెండు రోజులు అడ్డుకున్నారని సునీత ఆరోపించారు.
నా పోరాటం న్యాయం కోసమే.. తనకే పార్టీలతో సంబంధం లేదు
హత్య చేసిన వ్యక్తికి వైయస్ జగన్ అసెంబ్లీ వేదికగా క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆమె తప్పు పట్టారు. వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా ఆమె పేర్కొన్నారు. తాను న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని, తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని అన్నారు. నా పోరాటంలో భాగంగా నాకు అవసరమైన ప్రతి ఒక్కరితోనూ కలుస్తానని, ఎవరి దగ్గర కైనా వెళతానని సునీత తెలిపారు.
అవినాష్ రెడ్డిని ఓడించండి: సునీత
జగన్ జైల్లో ఉన్న సమయంలో అంతా తానై షర్మిల పార్టీని ముందుకు నడిపించారని, అలాంటి షర్మిలకు జగన్ అన్యాయం చేశారని మండిపడ్డారు. 2019 ఎన్నికలలో షర్మిలకు కడప లేదా వైజాగ్ నుండి సీటు ఇస్తారని భావించిన జగన్ ఆమెకు అవకాశం ఇవ్వలేదన్నారు. తన తండ్రిని చంపిన అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారని, అవినాష్ రెడ్డి ని కడపలో ఓడించాలని సునీత కోరారు. కడపలో షర్మిలను ప్రజలు ఆదరించాలన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications