వివేకా హత్యకు కుట్ర ఇలా-సీబీఐ తాజా ఛార్జిషీట్ లో వెల్లడి-వాళ్లిద్దరూ సేఫ్ ?
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తాజాగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే విస్తృతంగా దర్యాప్తు చేసి పలు ఆధారాలు సంపాదించిన సీబీఐ.. ఈ మేరకు కుట్ర కోణాన్ని వెల్లడిస్తూ తాజా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా, అనుమానితులుగా ఉన్న పలువురి పేర్లు, వారి పాత్రను కూడా ఈ ఛార్జిషీట్ లో పేర్కొంది.
వైఎస్ వివేకా హత్య కేసులో జరుపుతున్న దర్యాప్తులో భాగంగా సీబీఐ కోర్టులో దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ లో గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో దొర్లిన సాంకేతిక తప్పిదాల్ని సవరించి సమర్పించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఛార్జిషీట్లో వివేకా హత్యకు కుట్ర పన్నింది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డే అన్న విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్లలోనూ వీరి పేర్లు పేర్కొన్నా ఈసారి వీరిని ఏ 7, ఏ8లుగా పేర్కొంది.

అలాగే వివేకా హత్యలో ఆయన పీఏ కృష్ణారెడ్డి ప్రమేయంపైనా అనుమానాలున్నట్లు సీబీఐ పేర్కొంది. కానీ ఇందుకు తగిన ఆధారాలు దొరకలేదని వెల్లడించింది. మరోవైపు వివేకా హత్య తర్వాత ఆధారాల ధ్వంసం విషయంలో మిగతా నిందితులకు వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి కూడా సహకరించినట్లు సీబీఐ పేర్కొంది. అయితే హత్య కుట్ర విషయంలో మాత్రం ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించలేదని తెలిపింది. దీంతో మనోహర్ రెడ్డి సేఫ్ అయినట్లే భావిస్తున్నారు.
అటు వివేకా కేసులో హత్య పథకం, అమలుకు సంబంధించి సీబీఐ పలు కీలక ఆధారాలు సంపాదించింది. ఇందులో వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన ఇంట్లో వైఫై రూటర్ కు కనెక్ట్ అయిన ఫోన్లు, వాటి లొకేషన్లు తెలుసుకుంటున్నట్లు సీబీఐ పేర్కొంది. అలాగే వివేకా రాసిన లేఖపై వేలిముద్రల్ని గుర్తించేందుకు జరిపిన నిన్ హైడ్రిన్ పరీక్ష ఫలితాలు ఇంకా అందాల్సి ఉందని కూడా తెలిపింది. హత్య జరిగిన సమయంలో గూగుల్ టేకౌట్, నిందితుల ఫోన్ల లొకేషన్ డేటాను కూడా సీబీఐ తన ఛార్జిషీట్ లో కోర్టుకు సమర్పించింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications