YS Vivekananda Reddy: వివేకా కేసులో సుప్రీం అనూహ్య నిర్ణయం-సునీతకు భారీ షాక్..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సుప్రీంకోర్టు ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ తీరును ఆక్షేపిస్తూ ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆమె వాదనల్ని తోసిపుచ్చింది. అదే సమయంలో దర్యాప్తు సంస్థ సీబీఐ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ నిర్ణయానికి వచ్చింది. అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో మూడు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో సీబీఐ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. తమ వద్ద కేసు మెటీరియల్ ఉందని వాదించే ప్రయత్నం చేసిన సునీత రెడ్డి తరఫున లాయర్ సిద్ధార్థ లూత్రాకు అక్షింతలు వేసింది.

సుప్రీంకోర్టులోనే ట్రయల్ నిర్వహించాలనుకుంటున్నారా ? అని సిద్ధార్థ లూథ్రాపై సుప్రీంకోర్టు జస్టిస్ సుందరేష్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే సునీత రెడ్డి దాఖలు చేసిన అన్ని పిటిషన్లు డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అనంతరం సెక్షన్ 207 కింద కింది కోర్టులో దాఖలు చేసే పిటిషన్లపై విచారణ నాలుగు వారాలలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై విచారణ వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. వివేకా హత్య జరిగి ఏడేళ్లవుతున్నా ఇంకా సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతంలోనే సీబీఐ దర్యాప్తు పూర్తి చేసినా, అందులో కొందరిని విస్మరించారని, సమగ్ర దర్యాప్తు కావాలంటూ సునీత వరుస పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. దీనిపై సుప్రీంకోర్టు అసహనంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక ఆదేశాలు వెలువడ్డాయి.












Click it and Unblock the Notifications