హంతకులెవరో జగన్ కూ తెలుసు.. ! నాదీ షర్మిలదీ ఒకటే గోల్ - వివేకా కుమార్తె సునీత కామెంట్స్..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కడప రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హంతకులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి స్వరం పెంచుతున్నారు. ఇప్పటికే కడప టూర్ లో జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆమె.. ఇవాళ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హంతకుల్ని జగన్ కాపాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
హైదరాబాద్ లో అవినాష్ విశయం లో గతంలో జగన్ పెట్టించిన ప్రెస్ మీట్ విషయంలో చాలా గుడ్డిగా నమ్మానని సునీతారెడ్డి వ్యాఖ్యానించారు. మొన్నటికి మొన్న కమలాపురం ఎమ్మెల్యే (జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి) తాను టీడీపీ ట్రాప్ లో పడ్డానంటూ వ్యాఖ్యలు చేశారని.. అవును తాను, రాష్ట్ర ప్రజలు ట్రాప్ లోనే పడ్డారని సునీత పేర్కొన్నారు. ప్రజలు ఈసారి ఎన్నికల్లో వారి పిల్లల శ్రేయస్సు కోసం ఆలోచించాలని కోరారు.

జగన్ ను తాను ఈ మధ్య హైదరాబాద్ లోనూ, కడప లోనూ కొన్ని పాయింట్స్ అడిగానని, వాటికి అన్నగా కాకపోయినా సీఎంగా సమాధానం చెప్పాలని సునీతారెడ్డి కోరారు. ఆ మేరకు సీఎం గా ఆయనకు బాధ్యత వుందన్నారు. దేవుడికి తెలుసు కడప లో వున్నవారికి తెలుసు అంటే మీకు కూడా తెలుసనే అర్ధం కదా అన్నారు. మీరు బయటకు చెప్పండని కోరారు. అవినాష్ ను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. అవినాష్ ను విచారిస్తే వేరే ఏమైనా బయటకు వస్తుందనీ భయపడుతున్నారా అని సూటింగా ప్రశ్నించారు. నేను మీ సాక్షి ఛానల్ కు వస్తా చర్చకు సిద్ధం కావాలన్నారు.
కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు సునీతారెడ్డి అభినందనలు తెలిపారు. షర్మిల ఎంపీ గా పోటీ చేస్తుంటే నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ వుందన్నారు. 18 ఎమ్మెల్యే లు ఒక ఎంపీ పోటీ చేస్తే 15 మంది ఎమ్మెల్యే లు ఒక ఎంపీ ని వివేకా గెలిపించారని, జైల్ లో వుండగా మరో ప్రజా ప్రస్థానం అని ఎండనక వననక తిరిగి పిల్లల్ని వదిలి షర్మిల వైసీపీని నిలబెట్టిందన్నారు. ఆమె ఇంకా పవర్ ఫుల్ అవుతారు అని జైల్ నుంచి వచ్చాక పక్కన పెట్టారన్నారు. 2019 లో బై బై బాబు క్యాంపెయిన్ చేస్తే ఆమెను పక్కన పెట్టారన్నారు.
నాన్న షర్మిల నీ ఎంపీగా నిలబెట్టాలని అనుకున్నారని, ఇప్పుడు షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నందుకు సంఘీభావం తెలియజేశామన్నారు. 2 సంవత్సరాలకు ముందు పులివెందుల లో తనపై, తన భర్తపై సాక్షులను ప్రభావితం చేస్తున్నామని కేస్ పెట్టారని, ఇవాళ హైకోర్టులో ఆ కేసు విచారణకు వచ్చామన్నారు. వివేకం సినిమానా, డాక్యుమెంటరీనా అనేది చెప్పలేనని, కానీ చివరి అరగంట చూడాలంటే మాత్రం తనకు చాలా భయం వేసి కళ్లు మూసుకున్నట్లు తెలిపారు. అయితే సినిమా లో కంటే రియాలిటీ చాలా దారుణంగా ఉందన్నారు.
జగన్ చిన్నాన్నను ఎందుకు ఐదు సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని సునీతారెడ్డి ప్రశ్నించారు.ఏపీ ప్రభుత్వం రక్తంలో ఉందన్నారు. తాను ఎప్పుడూ రాజకీయాల్లో లేనని గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాను... జరుగుతున్న నిజం చెప్పడానికి వచ్చానన్నారు. ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే తనకూ, రాష్ట్రానికి మంచిది కాదన్నారు.సీబీఐ దర్యాప్తు కోసం పిటిషన్ వేసే ముందు జగన్ ను కలిసేందుకు చాలా ప్రయత్నించానని, అప్పుడు కూడా హెల్ప్ చేయలేదన్నారు. కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు.
నాన్న మొదటి వర్ధంతి కి పిలవడానికి కలుస్తాను అంటే రావద్దు అన్నారన్నారు. సీబీఐ ఛార్జ్ షీట్ ఆధారం గా వివేకం సినిమా తీశారన్నారు. షర్మిలను గెలిపించే బాధ్యత తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. తాను చేయగలిగింది చేస్తున్నానని తెలిపారు. షర్మిల తనకు చెల్లెలు మా ఇద్దరి పోరాటం ఒక్కటే అన్నారు. తన పోరాటం ఇంకా ఎక్కువ వుందన్నారు. ఈ రోజు ఇద్దరికీ ఒకె గోల్ అయితే వుందని, ఇప్పటికీ గోల్ అవినాష్ రెడ్డినీ, జగనన్న ను ఓడించాలి, వైసీపీని గద్దె దించాలనీ అన్నారు.
శిక్ష పడితే అవినాష్ ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతాడనే కేసు విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications