వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ఆవేదన పట్టదా?: హోదా కోసం వైయస్ జగన్ ధర్నా, అరెస్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం, ఏపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన మీకు అర్థం కాదా? ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కొనసాగిస్తున్నప్పుడు ఏపీకి ఎందుకివ్వరు.. ఇస్తే మీకొచ్చే నష్టం ఏమిటో చెప్పాలంటూ కేంద్రాన్ని, ఏపీ సీఎం చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపి ప్రత్యేకహోదా ఇవ్వలేమంటున్నారని.. అసలు ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఆర్థిక సంఘానికి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. సోమవారం న్యూఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నానుద్దేశించి జగన్‌ మాట్లాడుతూ.. వేలాది కిలోమీటర్లు దూరం నుంచి వచ్చి ధర్నా చేస్తున్న ప్రజల ఆవేదన కేంద్రం అర్థం చేసుకోవాలన్నారు.

'సీమాంధ్రకు జరిగే అన్యాయం నాకు తెలుసు' అని అప్పటి ప్రధాని మన్మోహన్‌ చెప్పారన్నారు. కలిసికట్టుగా నిర్మించుకున్న హైదరాబాద్‌ లేకపోవడం వల్ల 70 శాతం పరిశ్రమలు, 95శాతం సేవారంగ సంస్థలు దూరమవుతాయి.. సాఫ్ట్‌వేర్‌ రంగం పూర్తిగా దూరమవుతుంది కాబట్టే ప్రత్యేకహోదా ఇస్తామని మన్మోహన్‌ ప్రకటించారని గుర్తుచేశారు.

ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని పట్టుపట్టిన బిజెపి ఇప్పుడు అధికారంలోకి వచ్చాకా బిల్లులో లేదని సాకులు చెబుతోందన్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపైనా జగన్‌ విమర్శలు చేశారు. గత 15 నెలల్లో రాహుల్‌ గాంధీ ఒక్కసారి కూడా పార్లమెంటులో ఏపీ ప్రత్యేక హోదాపై మాట్లాడలేదని ఆరోపించారు. లంచాల కోసమే పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి పట్టిసీమను ముందుకుతెచ్చారని చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం, ఏపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన మీకు అర్థం కాదా? ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కొనసాగిస్తున్నప్పుడు ఏపీకి ఎందుకివ్వరు.. ఇస్తే మీకొచ్చే నష్టం ఏమిటో చెప్పాలంటూ కేంద్రాన్ని, ఏపీ సీఎం చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

వైయ్ జగన్

వైయ్ జగన్

14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపి ప్రత్యేకహోదా ఇవ్వలేమంటున్నారని.. అసలు ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఆర్థిక సంఘానికి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

సోమవారం న్యూఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నానుద్దేశించి జగన్‌ మాట్లాడుతూ.. వేలాది కిలోమీటర్లు దూరం నుంచి వచ్చి ధర్నా చేస్తున్న ప్రజల ఆవేదన కేంద్రం అర్థం చేసుకోవాలన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

'సీమాంధ్రకు జరిగే అన్యాయం నాకు తెలుసు' అని అప్పటి ప్రధాని మన్మోహన్‌ చెప్పారన్నారు.

ఢిల్లీ ధర్నా

ఢిల్లీ ధర్నా

కలిసికట్టుగా నిర్మించుకున్న హైదరాబాద్‌ లేకపోవడం వల్ల 70 శాతం పరిశ్రమలు, 95శాతం సేవారంగ సంస్థలు దూరమవుతాయి.. సాఫ్ట్‌వేర్‌ రంగం పూర్తిగా దూరమవుతుంది కాబట్టే ప్రత్యేకహోదా ఇస్తామని మన్మోహన్‌ ప్రకటించారని గుర్తుచేశారు.

ధర్నాకు మద్దతు తెలిపిన సీతారాం ఏచూరి

ధర్నాకు మద్దతు తెలిపిన సీతారాం ఏచూరి

అన్ని పార్టీలు కలిసిరావాలన్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి జగన్‌ ధర్నాకు మద్దతు తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని పట్టుపట్టిన బిజెపి ఇప్పుడు అధికారంలోకి వచ్చాకా బిల్లులో లేదని సాకులు చెబుతోందన్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపైనా జగన్‌ విమర్శలు చేశారు.

జగన్ అరెస్ట్

జగన్ అరెస్ట్

గత 15 నెలల్లో రాహుల్‌ గాంధీ ఒక్కసారి కూడా పార్లమెంటులో ఏపీ ప్రత్యేక హోదాపై మాట్లాడలేదని ఆరోపించారు. లంచాల కోసమే పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి పట్టిసీమను ముందుకుతెచ్చారని చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు.

హోదా కోసం నినాదాలు

హోదా కోసం నినాదాలు

'ప్రత్యేకహోదాపై శాసనసభలో తీర్మానం చేసి పంపుదామంటే చంద్రబాబు స్పందించలేదు. అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్దామన్నా చలనంలేదు. మీతో మేం కలిసివస్తాం కేంద్రాన్ని నిలదీద్దామన్నా స్పందించలేదు' అని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.

జగన్ బైఠాయింపు

జగన్ బైఠాయింపు

ఓటుకు నోటు కేసు విచారణ ముందుకెళ్లకుండా ఉండేందుకే ప్రత్యేకహోదా అంశంపై వెనకడుగు వేస్తున్నారని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వచ్చాయని ఈ సందర్భంగా జగన్‌ తెలిపారు.

జగన్ అరెస్ట్

జగన్ అరెస్ట్

పోలవరం పనులు నత్తనడకన జరుగుతున్నాయని కేంద్రంలో అధికారి రాసిన లేఖను ఆయన చదివి వినించారు.

జగన్ అరెస్ట్

జగన్ అరెస్ట్

పోలవరం గుత్తేదారు సరిగా పనిచేయడం లేదంటున్న చంద్రబాబుకు నాడు రూ.290 కోట్ల మొబిలైజేషన్‌ అడ్వాన్సు ఇచ్చినపుడు తెలియదా? అని జగన్‌ ప్రశ్నించారు. గుత్తేదారు తెదేపాకు చెందిన రాయపాటి సాంబశివరావుకు చెందిన సంస్థ కాదా? అని ప్రశ్నించారు.

'ప్రత్యేకహోదాపై శాసనసభలో తీర్మానం చేసి పంపుదామంటే చంద్రబాబు స్పందించలేదు. అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్దామన్నా చలనంలేదు. మీతో మేం కలిసివస్తాం కేంద్రాన్ని నిలదీద్దామన్నా స్పందించలేదు' అని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసు విచారణ ముందుకెళ్లకుండా ఉండేందుకే ప్రత్యేకహోదా అంశంపై వెనకడుగు వేస్తున్నారని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వచ్చాయని ఈ సందర్భంగా జగన్‌ తెలిపారు.

ప్రత్యేక హోదా పోరాటం ఆగదని.. శాసనసభ సమావేశాల్లో చంద్రబాబు నిలదీస్తామన్నారు. ఈ నెల 28న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అనంతరం జగన్‌.. 'పార్లమెంట్‌ వైపు అందరం కలిసి నడుద్దాం' అని కార్యకర్తలను కోరడంతో ఒక్కసారిగా వేదికవద్ద గందరగోళం ఏర్పడింది. ఈ సమయంలో కడప జిల్లా కమలాపురానికి చెందిన ప్రసాద్‌రెడ్డి అనేవ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పార్లమెంటు మార్చ్‌ సమయంలో పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో జగన్‌ అక్కడే కొద్దిసేపు బైఠాయించారు.

మీడియాతో మాట్లాడుతూ.. అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే అడ్డుకోవడం తగదన్నారు. ప్రజలపై లాఠీఛార్జి జరగకూడదనే తాము అరెస్టు అవుతున్నామని జగన్‌ తెలిపారు. అరెస్టు తర్వాత జగన్‌, ఎంపీ మేకపాటి, బొత్స సత్యనారాయణ తదితరులను పార్లమెంటు స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌కు తరిలించారు.

ఎంపీలు మిథున్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ప్రసాదరావు, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చెవిరెడ్డిలనూ అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. పార్టీ ఎంపీలు, 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు సీనియర్‌ నేతలతోపాటు వేలాదిమంది కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.

English summary
YSR Congress Party, which is set to hold a dharna in New Delhi on Monday to push for the demand of special status for Andhra Pradesh, has said that the TDP is ignoring the vital issue for political and commercial gain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X