Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ysrcp:వైసీపీకి కీలక నేత గుడ్ బై..?

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతున్న అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తుంది. వైసీపీని వీడేందుకు కీలక నేత సిద్దం అవుతున్నారనే వార్త వైరల్ అవుతుంది.మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేస్తున్నారనే ఊహగానాలు తెర మీదకు వచ్చాయి. గత కొద్దికాలంగా వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్నారని ..ఈక్రమంలోనే ఆమె వైసీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతుంది. కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ నుంచి 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

మొదటిసారి ఎంపీగా అయినప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మద్దతుతో ఐటీ కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రిగా పని చేశారామె. 2014లో సైతం కిల్లి కృపారాణి కాంగ్రెస్ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. సరిగ్గా 2019 ఎన్నికల మందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ సమయంలో శ్రీకాకుళం ఎంపీ సీటును ఆశించి భంగపడ్డారు. అప్పటికే ఆ సీటును దువ్వాడ శ్రీనివాస్‌కు కేటాయించడంతో పార్టీ గెలుపు కోసం కృషి చేశారామె.

YSR Congress

వైసీపీ అధికారంలోకి వచ్చాక నామినేట్ పదవి ఇస్తారని ఆమె ఎదురుచూశారు.రాజ్యసభ సీటును కేటాయిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న కిల్లి కృపారాణికి నిరాశే ఎదురైంది. దీంతో ఆమె వైసీపీ అధిష్టానంపై అసంతృప్తికి గురైందనే మాటలు వినిపించాయి. వచ్చే ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ దక్కకపోవడంతో..ఆమె పక్క చూపులు చూస్తున్నారని సమాచారం.

రాబోవు ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి జిల్లాకు చెందిన డాక్టర్ దానేటి శ్రీధర్ కి ఇప్పించాలని ధర్మాన సోదరులు ప్రయత్నిస్తున్నారని కిల్లి కృపారాణి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ఆమె వైసీపీని వీడటానికి సిద్దం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక టీడీపీ నుంచి కూడా కిల్లి కృపారాణికి ఆఫర్లు వస్తున్నాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

YSR Congress

దీంతో కిల్లి కృపారాణి ఒకవేళ టీడీపీలోకి వస్తే.. శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఆ పార్టీ అధిష్టానం రెడీగా ఉంది. ఆమె పార్టీలో చేరడమే తరువాయి అన్నట్టుగా టీడీపీ ఎదరు చూస్తోంది. ఇదిలా ఉంటే కిల్లి కృపారాణి ఆలోచనలు వేరేలా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం ఆమె శ్రీకాకుళం వైసీపీ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు జిల్లాలో ఎక్కడ నుంచైనా పోటీ చేసే అవకాశం జగన్ కల్పిస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. జిల్లాలో కాళింగ సామాజికవర్గం ప్రజలు అధిక సంఖ్యలో ఉంటారు. ఆ సామాజికవర్గానికే చెందిన కిల్లి కృపారాణిని వైసీపీ కూడా వదులుకోవడానికి సిద్ధంగా కనిపించడం లేదు.

YSR Congress

రాబోవు ఎన్నికల్లో కిల్లి కృపారాణి శ్రీకాకుళం లోక్‌సభ రేసులో కచ్చింతంగా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే ఆమె ఎటువంటి నామినేట్ పదవి కేటాయించలేదని వారంటున్నారు. జిల్లాలో వైసీపీ బలంగా కనిపిస్తుంది. దీనికి తోడు చంద్రబాబు రాజకీయాలు తనకు సరిపోవనే భావనలో కిల్లి కృపారాణి ఉన్నారు. ఈక్రమంలో కిల్లి కృపారాణి వైసీపీలోనే కొనసాగే అవకాశలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో కిల్లి కృపారాణి జిల్లా రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారో అని ప్రజలు అతృతుగా ఎదురు చూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+