2014 కోసం జగన్ కసరత్తు: తెలంగాణలోను పోటాపోటీ!

రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో సిపిఎంతో మాత్రమే పొత్తు ఉంటే ఉండవచ్చంటున్నారు. అయితే, పొత్తులతో సంబంధం లేకుండా 294 అసెంబ్లీ, 42 లోక్‌సభ స్ధానాల్లో అర్హులైన అభ్యర్ధులతో జాబితాను రూపొందించే పనిలో ఆరుగురు సభ్యులు నిమగ్నమయ్యారు.
వైయస్ అనిల్ రెడ్డి, దాడి వీరభద్ర రావు, సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవి సుబ్బా రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మైసూరా రెడ్డి ఈ కమిటీలో ఉన్నారు. గతంలో అభ్యర్థుల కూర్పులో వైవి సుబ్బారెడ్డి పక్కన పెట్టినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ ఆయన కూడా ఇందులో భాగస్వాములయ్యారట.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యవాదం నెత్తినెత్తుకున్నప్పటికీ తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శాసనసభ, లోక్‌సభ స్ధానాలకు ఆశావహుల సంఖ్య బాగా ఉందట. ఇక సీమాంధ్రలో టిక్కెట్ కోసం పోటాపోటీ ఉంది.
సంక్రాంతి నాటికి ఒక్కో స్ధానానికి ముగ్గురేసి అభ్యర్ధులతో ఒక సమగ్ర నివేదికను జగన్‌కు అందించనున్నారని చెబుతున్నారు. విభజన జరిగినా, జరగకపోయినా ఈ పరిణామాలతో సంబంధం లేకుండా పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోందంటున్నారు.












Click it and Unblock the Notifications