వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌కు ఎదురు దెబ్బ: ఓ ఎమ్మెల్సీ కట్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు ఓ ఎమ్మెల్సీ సీటును కోల్పోతోంది. ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రధాని ఎన్నికల అధికారి నోటిఫై చేశారు.

అయితే, ఆశ్చర్యకరంగా ఎన్నికల కమిషన్ ఒక్క ఎమ్మెల్సీ సీటుకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మరో సీటు ఖాళీ ఉందనే విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి సిఇసికి గుర్తు చేశారు. అయితే, రెండో సీటుకు ఉప ఎన్నిక నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు.

YSR Congress loses out on one MLC seat

రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎమ్మెల్యేల కోటా కింద 17 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి. అయితే, ఎపి శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా కింద 16 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. రెండు సీట్లకు సిఇసి ఉప ఎన్నికలు నిర్వహించి ఉంటే వైయస్సార్ కాంగ్రెసు ఓ సీటును దక్కించుకుని ఉండేది.

ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఒక్క ఎమ్మెల్సీ సీటును అధికార తెలుగుదేశం పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. ఆ సీటును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

English summary
Owing to the decision of the Central Election Commission, the YSRC lost one MLC seat. The chief electoral officer had notified two vacancies in the Andhra Pradesh State Legislative Council, in MLAs quota, in by-elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X