వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డికి అస్వస్థత: స్వైన్‌ఫ్లూ టెస్ట్, హైదరాబాద్‌కు
హైదరాబాద్: గుంటూరు జిల్లా నర్సరావుపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అస్వస్థతతో బాధపడుతున్నారు. గత మూడు రోజులుగా గోపిరెడ్డి జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు ముందు జాగ్రత్తగా స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేశారు.
నివేదికలు వచ్చిన అనంతరం స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయా లేదా అనేదాని పైన వైద్యులు నిర్ధారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఉత్తమ చికిత్స కోసం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు తరలిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు క్రాస్ట్ రోడ్డు వద్ద గురువారం ఉదయం పెళ్లి బృందం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడగా, వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను రెండు 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పెందుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్ ఉప్పలపాడు వద్ద అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని క్షతగాత్రులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 30 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications