4ఏళ్లుగా చెప్తున్నవే: టి,సీమాంధ్రకి జగన్ వేరు మేనిఫెస్టో
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం విడుదల చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లకు వేర్వేరు మేనిఫెస్టోలను ఆయన విడుదల చేశారు. తాను గత నాలుగేళ్లుగా చెబుతున్న అంశాలనే మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్నాయన్నారు.
రాష్ట్రానికి స్వర్ణ యుగం అందించింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మీడియాను మేనేజ్ చేయడంలో దిట్ట అని, ఆయన చేసింది తక్కువ ప్రచారం చేసుకున్నది ఎక్కువ అని ఆరోపించారు. బాబు హయాంలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు ఎలా ఉన్నాయో... వైయస్ హయాంలో ఎలా ఉన్నాయో వివరించారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ సాధించలేని అభివృద్ధి వైయస్ చేసి చూపించారన్నారు.
చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల మాదిరి టిడిపి నాయకులకు పంచి పెట్టారని ఉదాహరణలతో సహా వివరించారు. పారిశ్రామిక సంస్థలను ఎవరెవరికి దారాదత్తం చేసి పేర్లతో సహా వెల్లడించారు. తాను గత నాలుగేళ్లుగా రాష్ట్రం నలువైపులా పర్యటించానని, గ్రామాల్లో ఎన్నో పేద గుడిసెలను చూశానని, పేదల కష్టాల గురించి తాను విన్నది, చూసినదే మేనిఫెస్టోలో చేర్చామన్నారు.

మేనిఫెస్టోలోని అంశాలు..
నిరుపేద పిల్లల కోసం అమ్మఒడి పథకం. ఈ పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లలకు రూ.500 చొప్పున తల్లి బ్యాంక్ అకౌంట్‌లో జమ
ఒక్క కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే రూ.1000 జమ
ఫీజు రీయింబర్స్‌మెంట్ పాక్షికంగా గాక మొత్తం ఫీజు చెల్లింపు.
వృద్ధులకు రూ.700 ఫించన్
20 వేల కోట్ల రూపాయిల డ్వాక్రా రుణాలు మాఫీ.. రుణ విధానంలో మార్పులు
రూ.2వేల కోట్లతో ప్రకృతివైపరీత్యాల సహాయనిధి ఏర్పాటు
ఈ నిధి నుంచి రైతులను తక్షణమే ఆదుకుంటాం
అధికారంలోకి రాగానే రెండు జిల్లాలకు వ్యవసాయకాలేజీ
మూడు అగ్రికల్చర్, వెటర్నరీ యూనివర్శిటీల ఏర్పాటు
ప్రతి మండల కేంద్రంలో 102, 103 మొబైల్ టీమ్ సర్వీసులు. ఫోన్ చేసిన ప్రతీరైతుకు 20నిమిషాల్లో సేవలందిస్తుంది
డ్వాక్రా మహిళల రూ.20వేల కోట్ల రుణాల మాఫీ
డ్వాక్రా మహిళలకు రుణవిధానంలో మార్పు
గ్రామాల్లోకే ప్రభుత్వపాలన
ప్రతి గ్రామంలో ఒక ఆఫీస్ ఏర్పాటు
అక్కడే ఎవరికి ఏకార్డు కావాలన్న 24గంటల్లో జారీ
స్థానికుల్లో పదిమంది మహిళలకు ఆఫీస్‌లో బాధ్యతలు
వారే గ్రామంలో ఆడపోలీసుల్లా వ్యవహరిస్తారు
బెల్ట్ షాపులపై నిఘా పెడతారు
పిఎహెచ్‌సిలు, స్కూల్స్, పిడిఎస్, పెన్షన్లు మానిటరింగ్ చేస్తారు
20వేల పంచాయతీల్లో 2లక్షల మంది మహిళలకు ఉపాధి
ఐదేళ్లలో 50లక్షల ఇళ్లు. రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేద ఉండకూడదు
ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు
ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అయినవాళ్లకు... తిరిగి పనుల్లోకి వెళ్లేవరకు నెలకు రూ.3వేలు
జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి
హైదరాబాద్‌ను మించిన నగరం నిర్మాణం
20 ఫాకల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు
2019 నాటికి విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా ఏర్పాటు
నిరుపేదల ఇళ్లకు సబ్సిడీలో విద్యుత్‌ఛార్జీలు
నెలకు 150యూనిట్లకు రూ.100 మాత్రమే బిల్లు
మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు, టీవీకి పవర్
మద్యం పై ఆంక్షలు. నియోజకవర్గంలో ఒకచోట మాత్రమే మద్యం అమ్మకం
ప్రతినియోజకవర్గంలో వృద్దాశ్రమం, అనాధాశ్రమం
ఆతరువాత మండల కేంద్రాలకు ఆశ్రమాల విస్తరణ
వంటగ్యాస్‌పై రూ.100 సబ్సిడీ
ఉద్యోగులకు అత్యుత్తమ పిఆర్‌సి. కాంట్రాక్ట్ ఉద్యోగులపై కమిటీ. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి సర్వీస్ రెగ్యులరైజ్. ప్రతి ఉద్యోగికి పక్కా ఇళ్లు.
రైతులకు 100 రూపాయలకే 150 యూనిట్ల విద్యుత్. పగలు ఏడు గంటల విద్యుత్.
జిల్లాకో ఎయిర్ పోర్టు, యూనివర్సిటీ
జిల్లాల అనుసంధానం
విద్యావంతులకు స్థానికంగా ఉద్యోగ అవకాశం.
గ్యాస్ సబ్సిడీ రూ.50 నుండి రూ.100కు పెంపు
గ్రూప్ 4 సిబ్బందికి ఇళ్లు
రెండు జిల్లాలకో అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం












Click it and Unblock the Notifications